రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

By telugu teamFirst Published Aug 21, 2019, 2:25 PM IST
Highlights

ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడతామన్నారు. ఆమరణ దీక్షకు  కూడా కూర్చుంటామన్నారు. అమరావతి నిర్మాణంపై కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టామని చెప్పారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం జగన్ కి ప్రజలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు అధికారం ఇచ్చారని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రజా వేదికను కూలగొట్టి ప్రజా ధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు.

ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కాగా... తమ అధినేత చంద్రబాబు మీద కక్షతోనే రాజధానిని మార్చాలని వైసీపీ నేతలు భావిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణం నిలిపివేస్తే ఆమరణ దీక్ష చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. రాజధానిని తరలించే కుట్ర చేస్తే... రైతులతో కలిసి మహా ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రాష్ట్ర రాజధానిగా అమరావతి సురక్షితం కాదని...అక్కడ వర్షాలు పడితే మునిగిపోయే ప్రాంతాలు చాలా ఉన్నాయంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... ఏపీ రాజధాని అమరావతిని నిలిపివేస్తే రైతులతో మహా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

Latest Videos

ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడతామన్నారు. ఆమరణ దీక్షకు  కూడా కూర్చుంటామన్నారు. అమరావతి నిర్మాణంపై కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టామని చెప్పారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం జగన్ కి ప్రజలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు అధికారం ఇచ్చారని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రజా వేదికను కూలగొట్టి ప్రజా ధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు.

ఇప్పుడు రాజధానిని దొనకొండకో, ఇడుపులపాయకో తీసుకువెళ్లాలని కుట్ర చేస్తే చూస్తూ ఉరుకోమన్నారు. ఇదే ఘటనపై టీడీపీ నేత , మాజీ స్పీకర్ కోడెల మాట్లాడుతూ.. అమరావతి వాటర్ ఫ్రంట్ కేపిటల్ అని, ఇది తెలుగు ప్రజల ఆకాంక్ష అని అన్నారు. దీనిని నిర్వీర్యం చేసే కుట్ర ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం దానిని స్మశానం లో నడిచినట్లు తయారు చేసిందని ఆరోపించారు. లక్షల మంది ఉద్యోగాలు, పెట్టుబడులు పోతాయన్నారు. ఏదైనా ప్రజల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ముందుకు పోవాలని కోడెల అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

click me!