జైలు జీవితం గడిపినంత తేలిక కాదు పాలించడం: జగన్ పై మాజీమంత్రి సంచలనం

By Arun Kumar PFirst Published May 29, 2020, 8:27 PM IST
Highlights

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైలు జీవితం గడపటం నేర్చుకుని అదే పాలనను ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు

ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ బలమైనది  కావడం వల్లే ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి నియమింపబడ్డారని మాజీ మంత్రి జవహర్ తెలిపారు. ఎన్నికల కమీషనర్ ని తొలగించడం కోసం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేయడం హర్షణీయమని అన్నారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైలు జీవితం గడపటం నేర్చుకుని అదే పాలనను ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఏడాది పాలనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 65 సార్లు కోర్టు తీర్పు ఇవ్వటం ఎక్కడా ఉండదేమో అన్నారు. 

కరోనా వైరస్ నియంత్రణ కోసం రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తే.... ఆయనకు కులాన్ని అంటగట్టి కమిషనర్ ని మార్చి చేసి ప్రజల్లో నవ్వుల పాలయ్యాడు. అంతే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఐతే కోర్టులు చుట్టూ తిరుగుతున్నారో అదే రీతిలో ఆయా శాఖల ఐఏఎస్ అధికారులను కోర్టులు చుట్టూ తిప్పిస్తున్నారని జవహర్ ధ్వజమెత్తారు.

ఎస్ఈసీ నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ తొలగింపు విషయమై ఆర్డినెన్స్ తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు అభిప్రాయపడింది.మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను కూడ హైకోర్టు కొట్టివేసింది.నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కూడ హైకోర్టు ఇవాళ సంచలన తీర్పును వెల్లడించింది.

read more  ఏపీ హైకోర్టు సంచలన తీర్పు: ఏపీ ఎస్ఈసీగా కనగరాజ్ ఔట్, నిమ్మగడ్డ ఇన్

నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ను ఎన్నికల సంఘం కమిషనర్ గా తొలగించడాన్ని నిరసిస్తూ ఏపీ హైకోర్టులో 13 పిటిషన్లు దాఖలయ్యాయి.ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఇవాళ తుది తీర్పు ఇచ్చింది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ను ఎన్నికల సంఘం కమిషనర్ గా తొలగించడాన్ని నిరసిస్తూ ఏపీ హైకోర్టులో 13 పిటిషన్లు దాఖలయ్యాయి.ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఇవాళ తుది తీర్పు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ రిటైర్డ్ న్యాయమూర్తి వి. కనగరాజ్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన 619 జీవోను జారీ చేసింది. రమేష్ కుమార్ ను తొలగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసింది. ఈ మేరకు ఆర్డినెన్స్ ను తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ అధారంగా 619 జీవోను జారీ చేసింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో కనగరాజ్ ను నియమించింది. 

click me!