3 గంటల పాటు డ్యాన్స్, సుహారిక మరణానికి కారణం అదేనా: కీలకంగా పోస్ట్‌మార్టం నివేదిక

By Siva KodatiFirst Published May 29, 2020, 7:25 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కన్నా కోడలు సుహారిక ఎలా చనిపోయింది..? గురువారం ఉదయం సుహారిక ఎక్కడికెళ్లింది.?ఆమె చనిపోవడానికి ముందు అసలేం జరిగిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

నిన్న జరిగిన పార్టీలో సుహారిక, ఆమె మరిదితో పాటు మరో ఇద్దరు ఉన్నట్లుగా తెలుస్తోంది. సుహారిక సోదరి భర్త ప్రవీణ్‌తో పాటు పార్టీలో ఉన్న స్నేహితులు పవన్ రెడ్డి, వికాస్‌లను పోలీసులు విచారించారు. పార్టీలో సుహారిక 3 గంటల పాటు డ్యాన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. డ్యాన్స్ చేస్తూనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు.

డ్యాన్స్ చేసినంత మాత్రాన చనిపోతారా..? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో విచారణ ముందుకు సాగాలంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్ కీలకంగా మారింది. పార్టీలో ఆహారంతో పాటు సుహారిక ఏం తీసుకున్నారనేది పోస్ట్‌మార్టం నివేదికలో తేలనుంది. 

Also Read:కన్నా లక్ష్మినారాయణ కోడలి మృతి: మిత్రుడి ఇంట్లో విందు, డ్యాన్స్ చేస్తూ....

సుహారికకు కన్నా చిన్న కుమారుడు ఫణీంద్రతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ నంబర్ 11లో ఉంటున్నారు. సుహారిక తల్లి మల్లిసాగరిక కూడా వీరితో ఉంటోంది. సుహారిక చెల్లె నిహారిక భర్త ప్రవీణ్ రెడ్డికి బంజారాహిల్స్ కు చెందిన వివేక్, విహాస్, పవన్ రెడ్డిలు మిత్రులు. వీరు తరుచుగా పార్టీలు చేసుకుంటూ ఉంటారు. 

గురువారం ఉదయం 7.30 గంటలకు వారంత పవన్ రెడ్డి ఇంట్లో పార్టీకి ప్లాన్ చేసుకున్నారు. సుహారిక భర్త ఫణీంద్రకు వీలు కాకపోవడంతో సుహారిక మాత్రమే పార్టీకి వెళ్లారు.

అప్పటి నుంచి రెండు గంటల పాటు విరామం లేకుండా డ్యాన్స్ చేయడంతో స్పృహ తప్పి పడిపోయారు. సమీపంలోని ఏఐజీ ఆస్పత్రికి ఆమెను తరలించారు. అరగంట పాటు వైద్యులు చికిత్స అందించినా ఆమెలో కదలిక కనిపించలేదు. దీంతో ఆమె మరమించినట్లు ధ్రువీకరించారు. 

Also Read:కన్నా చిన్నకోడలి అనుమానాస్పద మృతి: ఆత్మహత్య మాత్రం కాదంటున్న పోలీసులు

అయితే సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వైద్యులతో మాట్లాడారు. విందులో పాల్గొన్నవారినుంచి వివరాలు సేకరించారు. తన కూతురు మరణంపై అనుమానం లేదని సుహారిక తల్లి మల్లిసాగరిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. 

డ్యాన్స్ చేయడం వల్లనే స్పృహ తప్పిపోయారని, ఆమె మరణంపై ఏ విధమైన అనుమానాలు లేవని భర్త ఫణీంద్ర కూడా స్టేట్ మెంట్ ఇచ్చారు. కార్డియాక్ అరెస్టు తో మరణించి ఉండవచ్చునని అన్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే మరణానికి గల కారణాలు తెలుస్తాయని సీఐ రవిందర్ చెప్పారు. 

click me!