
ఒకవైపు నంద్యాల ఉపఎన్నిక హీటునే తట్టుకోవటం కష్టంగా ఉంటే తాజాగా కాకినాడ మున్సిపల్ కార్పొరేష్ కు ఎన్నికల షెడ్యూల్ మోగింది. ఎన్నికల కమీషన్ గురువారం రాత్రి షెడ్యూల్ ను విడుదల చేసింది. కార్పొరేషన్ కు చివరగా 2005లో ఎన్నికలు జరిగాయి. అంటే కార్పొరేషన్ కాలపరిమితి ముగిసిన 2010 తర్వాత ఎన్నికలే జరగలేదు. తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 29న ఎన్నికలు జరుగుతుంది. ఈ నెల 7-10 వరకూ నామినేషన్ల పరిశీలనుంటుంది. 11న నామినేషన్లను పరిశీలిస్తారు. 16వ తేదీలోగా ఉపసంహరణలకు గడువిచ్చారు. 29వ తేదీన పోలింగ్, సెప్టెంబర్ 1న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజన్లున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్ల కేటాయింపు కూడా పూర్తయిపోయింది. వివిధ కారణాలతో కార్పొరేషన్ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోంది. చివరకు ప్రజా ప్రయోజన వాజ్యంతో కోర్టు ప్రభుత్వంపై సీరియస్ అయింది. చివరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, మున్సిపల్ కమీషనర్ కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేటప్పటికి హటాత్తుగా ఎన్నికల షెడ్యూల్ జారీ అవ్వటం గమనార్హం. ఎప్పుడైతే షెడ్యూల్ విడుదలైందో తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలు కూడా ఒక్కసారిగా వేడెక్కాయి. ఈనెల 23న నంద్యాల పోలింగ్ అయిన వెంటనే 29వ తేదీన కాకినాడ పోలింగ్ జరగబోతోంది. చూడాలి ప్రధాన పార్టీల హీట్ ఏరేంజిలో ఉంటుందో.