కవరేజి చూసి తమ్ముళ్ళకు మతిపోతోంది

First Published Aug 4, 2017, 7:54 AM IST
Highlights
  • ఇంతకాలం తమది అని అనుకుంటున్న దినపత్రికలోనే జగన్ కు మద్దతుగా ఇటువంటి వార్తలు చూస్తున్న తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారు.
  • ఎందుకంటే, ఒకపుడు అసలు చంద్రబాబును విమర్శిస్తూ జగన్ కానీ వైసీపీ నేతలు కానీ ఎవరు మాట్లాడినా ఏమాత్రం కనిపించేది కాదన్నది వాస్తవం.
  • అటువంటిది ఇటీవల జగన్ కు కూడా ఈ దినపత్రికలో ప్రాధాన్యత పెరగటాన్ని తమ్ముళ్లు ఏమాత్రం జీర్ణించుకోలేకున్నారు.

తమ్ముళ్లకు మతిపోతోంది. ఇంతకాలం వైఎస్ కుటుంబాన్ని పూర్తిస్ధాయిలో వ్యతిరేకించటంతో పాటు చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలిచిన ఓ ప్రముఖ దినపత్రికలో నంద్యాలలో జరిగిన బహిరంగసభ తాలూకు కవరేజి ఇది. అటువంటి పత్రికలో నంద్యాలలో జగన్ బహిరంగసభను పూర్తిస్ధాయిలో కవర్ చేయటమేంటి? అదికూడా చంద్రబాబుపై జగన్ ధ్వజమెత్తటాన్ని. ఇంతకాలం తమది అని అనుకుంటున్న దినపత్రికలోనే జగన్ కు మద్దతుగా ఇటువంటి వార్తలు చూస్తున్న తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారు.

ఎందుకంటే, ఒకపుడు అసలు చంద్రబాబును విమర్శిస్తూ జగన్ కానీ వైసీపీ నేతలు కానీ ఎవరు మాట్లాడినా ఏమాత్రం కనిపించేది కాదన్నది వాస్తవం. అటువంటిది ఇటీవల జగన్ కు కూడా ఈ దినపత్రికలో ప్రాధాన్యత పెరగటాన్ని తమ్ముళ్లు ఏమాత్రం జీర్ణించుకోలేకున్నారు. నంద్యాలనే కాదు లేండి ఆమధ్య విశాఖలో జరిగిన ప్లీనరీ సమావేశాల కవరేజి కూడా ఓ రేంజిలో రావటాన్ని చూసిన తమ్ముళ్ళు అప్పట్లోనే గింజుకున్నారు.  

దినపత్రికలోనే కాదు గురువారం జగన్ బహిరంగసభను తమ ఛానల్లో కూడా పూర్తిగా రిలే చేసారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే సాక్షి ఛానల్ కన్నా బాగా కవరేజి చేసారని జనాలు కూడా చెప్పుకుంటున్నారు. బహిరంగసభ గ్రౌండ్ నే కాకుండా జనాలతో నిండిపోయిన చుట్టుపక్కల రోడ్లను కూడా చూపారట. అసలు ఈ స్థాయిలో జగన్ కు ప్రచారం ఇవ్వాల్సిన అవసరం ఏంటని తమ్ముళ్ళు ప్రశ్నించుకుంటున్నారు.

దానికి తోడు ఈమధ్య తరచుగా మీడియా అధిపతి-జగన్ మధ్య భేటీలు కూడా జరుగుతున్నాయట లేండి. దాంతో దినపత్రికకు, టిడిపికి మధ్య ఏమైనా చెడిందా అంటూ తమ్ముళ్ళు ఆశ్చర్యపోతున్నారు. దాంతో జనాల్లో కనిపిస్తున్న ప్రజావ్యతిరేకతను గ్రహించి, భవిష్యత్తును ఊహించే యాజమాన్యం ముందు జాగ్రత్త పడుతున్నదా? అంటూ తమ్ముళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

click me!