రుణాలు ఎగొట్టేవారు టెర్రరిస్టుల కన్నా హీనమట....

Published : Aug 04, 2017, 09:11 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
రుణాలు ఎగొట్టేవారు టెర్రరిస్టుల కన్నా హీనమట....

సారాంశం

రుణాలు ఎగవేసే వారు టెర్రరిస్టులకన్నా హీనమన్నది ఎంపి అభిప్రాయం. అటువంటి వారిని ఎట్టి పరిస్ధితిలోనూ వదిలిపెట్టకూడదట. మొండి బకాయిల వసూళ్ళపై గత ప్రభుత్వాలు పట్టించుకోలేదట, రైతుల మొండి బకాయిలకన్న కార్పొరేట్ కంపెనీల మొండి బకాయిలే అత్యధికంగా ఉన్నాయట.

‘రుణ ఎగవేతదారులు టెర్రరిస్టుల కన్నా హీనం’.. ఈ స్టేట్ మెంట్ ఎవరిదో గమనించారా? విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి టిడిపి ఎంపి అవంతి శ్రీనివాస్ ది. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగవేసే వారి గురించి ఎంత ఘాటైన వ్యాఖ్యలు చేసారో. రుణ ఎగవేతదారులు, పెరిగిపోతున్న బ్యాంకుల మొండి బకాయిల విషయంలో ఎంపికి గుండె ఎంతమండిపోతే ఈ స్ధాయి స్టేట్మెంట్ ఇస్తారు?

రుణాలు ఎగవేసే వారు టెర్రరిస్టులకన్నా హీనమన్నది ఎంపి అభిప్రాయం. అటువంటి వారిని ఎట్టి పరిస్ధితిలోనూ వదిలిపెట్టకూడదట. మొండి బకాయిల వసూళ్ళపై గత ప్రభుత్వాలు పట్టించుకోలేదట, రైతుల మొండి బకాయిలకన్న కార్పొరేట్ కంపెనీల మొండి బకాయిలే అత్యధికంగా ఉన్నాయట. బ్యాంకు రుణాలను కావాలని ఎగవేసే పెద్ద చేపలను ప్రభుత్వం పట్టుకుని కఠినంగా శిక్షించాలని గట్టిగా డిమాండ్ చేసారు.

ఇంతకీ ఎంపి ఓ విషయం మరచిపోయినట్లున్నారు. మన రాష్ట్రానికి సంబంధించి బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగొట్టినవారు టిడిపిలోనే కావాల్సినంతమంది ఉన్నారు. మంత్రివర్గంలోనే గంటా శ్రీనివాసరావున్నారు. ఈ మంత్రి ఎంపికి అత్యంత సన్నిహితుడే. రుణాల ఎగవేతపై కేంద్రమంత్రి సుజనా చౌదరికి నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే కదా. ఆ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది లేండి.

ఇక, నరసరావు పేట ఎంపి రాయపాటి సాంబశివరావు, నెల్లూరు జిల్లాలోని ఎంఎల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఎంఎల్ఏ శ్రీనివాస్ పై కేసులు కూడా నమోదైన విషయమూ అందరికీ తెలిసిందే. వీరుకాకుండా ఇంకా చాలామందే ఉండుంటారు టిడిపిలో. ఎందుకంటే, ఒక్కోరి బండారం మెల్లిగా బయటపడుతోంది. కాబట్టి ఎంపిగారి డిమాండ్ ప్రకారం ముందు చర్యలు తీసుకోవాల్సింది టిడిపి నేతలపైనే. ఏమంటారు? ఎనీ డౌట్ ?

PREV
click me!

Recommended Stories

Nara Lokesh Attends Parliament Committee Workshop Inauguration| Asianet News Telugu
Nara Lokesh Speech: లూథరన్ క్రీస్తు కరుణాలయం ప్రారంభోత్సవంలో మంత్రి నారాలోకేష్ | Asianet News Telugu