అపార్ట్ మెంట్ మీదినుంచి దూకి.. ఎనిమిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి !

Published : Oct 06, 2021, 09:02 AM ISTUpdated : Oct 06, 2021, 10:10 AM IST
అపార్ట్ మెంట్ మీదినుంచి దూకి.. ఎనిమిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి !

సారాంశం

ఈ క్రమంలో వారికి తాము నివాసముంటున్న  పక్క అపార్ట్ మెంట్ లో కుమార్తె  శవమై కనిపించింది. అపార్ట్మెంట్ నాలుగవ అంతస్తు నుంచి దూకి  suicideకు పాల్పడినట్లు  పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దువ్వాడ పోలీసులు  అన్వేషిస్తున్నారు.  

విశాఖపట్నంలో ఓ బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. నగరంలోని అగనంపూడి సమీపంలో శనివాడలో ఆదిత్య అపార్ట్మెంట్ వాచ్మెన్ కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  గత రాత్రి 9 గంటల నుంచి  కుమార్తె కనబడకపోవడంతో బాలిక తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు.  

ఈ క్రమంలో వారికి తాము నివాసముంటున్న  పక్క అపార్ట్ మెంట్ లో కుమార్తె  శవమై కనిపించింది. అపార్ట్మెంట్ నాలుగవ అంతస్తు నుంచి దూకి  suicideకు పాల్పడినట్లు  పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దువ్వాడ పోలీసులు  అన్వేషిస్తున్నారు.  

టీచరే కీచకుడయ్యాడు.. మైనర్ ను కిడ్నాప్ చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు.. ఆరేళ్ళ తరవాత..

మృతురాలు ఎనిమిదో తరగతి చదువుతున్న పండ్రంకి పావనిగా గుర్తించారు.  బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, హఠాత్తుగా బాలిక ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? కారణాలేంటి? తల్లిదండ్రులతో గొడవపడిందా? ఏ విషయంలోనైనా మనస్తాపం చెందిందా? ప్రేమ వ్యవహారమా? ఎవరైనా మోసం చేశారా? బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఏదైనా చిక్కుల్లో ఇరుక్కుందా? అనే కోణంలో పోలీసులు  దర్యాప్తు చేపట్టారు. ఈ దిశగా అనేకమందిని ప్రశ్నిస్తున్నారు. 

కాగా, అగనంపూడి శనివాడ సాయిరాం  సాయిరామ్ నగర్ కాలనీ లో మైనర్ బాలిక పాండ్రంకి పావని 14 సంవత్సరాలు ఆదిత్య నివాస్ అపార్ట్మెంట్ నుంచి దూకి చనిపోయిన ఘటనలో ఆదిత్య నివాస్ అపార్ట్ మెంట్ 101  ఫ్లాట్ లో ఉన్న ఆరుగురు బ్యాచిలర్స్ ను దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ..

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్