టీచరే కీచకుడయ్యాడు.. మైనర్ ను కిడ్నాప్ చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు.. ఆరేళ్ళ తరవాత..

By AN TeluguFirst Published Oct 6, 2021, 7:27 AM IST
Highlights

విశాఖ జిల్లా చోడవరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న పదమూడేళ్ల బాలికను అదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కొయ్యాన తిరుపతిరావు 2015మే 26న కిడ్నాప్ చేశారు.

అనకాపల్లి : చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు.. తన విద్యార్థుల్ని కన్నపిల్లల్లా కాపాడాల్సిన టీచర్.. అభం, శుభం తెలియని విద్యార్థిని మీద కన్నేశాడు. అప్పటికే పెళ్లై, పిల్లలు ఉన్నా కూడా ఆ మైనర్ ను మాయమాటలతో లొంగదీసుకున్నాడు. దీనితో ఆగకుండా ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత వారిద్దరూ కనిపించకుండా పోయారు. ఇది జరిగి ఆరేళ్లవుతుంది. అయితే ఇప్పుడు ఈ కేసులో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. 

ఆరు సంవత్సరాల క్రితం బాలిక kidnap కేసులో నిందితుడిగా ఉన్న ఓ ఉపాధ్యాయుడిని అనకాపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు డీఎస్పీ శ్రావణి మంగళవారం వివరాలు వెల్లడించారు. విశాఖ జిల్లా చోడవరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న పదమూడేళ్ల బాలికను అదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కొయ్యాన తిరుపతిరావు 2015మే 26న కిడ్నాప్ చేశారు.

బాలిక తండ్రి శ్రీశైలపు శ్రీనివాసరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యింది. చదువుకుంటుందని స్కూలుకు పంపితే ఇలా అక్కడి టీచర్లే కీచకులుగా మారడం మీద అనేక ఆందోళనలు రేగాయి. అంతేకాదు న్యాయం చేయాలని బాలిక తండ్రి నాటి సీఎం చంద్రబాబు నాయుడుని వేడుకోవడంతో ఆయన కేసును సీబీఐకి అప్పగించారు. అయినా, ఈ కిడ్నాప్ కేసు దర్యాప్తు కొలిక్కి రాలేదు. బాలిక దొరకలేదు. టీచర్ ఆచూకీ తేలలేదు. 

విజయవాడ: మటన్‌లో బీఫ్ కలిపి విక్రయం.. ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు , రెస్టారెంట్ సీజ్

అయితే, ఇటీవల పెండింగ్ కేసులమీద సమీక్షించిన జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బాలిక, తిరుపతరావు ఇద్దరూ రాజస్థాన్లోని అల్వార్ లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. బాలికకు ఇప్పుడు 19 యేళ్లు నిండాయని, ఆమెకు ప్రస్తుతం కుమారుడు,కుమార్తె ఉన్నారని డీఎస్పీ శ్రావణి తెలిపారు.

ముగ్గుర్నీ ఆమెతల్లిదండ్రులకు అప్పగించి, తిరుపతిరావును కోర్టు ఆదేశం మేరకు రిమాండుకు తరలించామన్నారు. నిందిుతుడికి గతంలోనే వివాహమయ్యిందని అతనికి ఒక బాబు ఉన్నాడన్నారు. 

click me!