జగన్ బెయిర్ రద్దుకు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశా.. రఘురామ

By AN Telugu  |  First Published Oct 6, 2021, 8:10 AM IST

D courtకు సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకావలసి ఉందని, కానీ ఏదో ఒక కారణంతో వారు రావడం లేదని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.


న్యాయం కోసం, ధర్మం కోసం చివరి వరకు పోరాడుతానని వైసీపీ నరసాపురం  mp raghuramakrishnamraju స్పష్టం చేశారు. అక్రమాస్తుల కేసులో సీఎం జన్మోహన్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు.

ఆయన మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ED courtకు సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకావలసి ఉందని, కానీ ఏదో ఒక కారణంతో వారు రావడం లేదని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.

Latest Videos

undefined

ఇంకా ఎన్ని వాయిదాలు వేస్తారో చూడాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కులాలకు 10 శాతం EWS రిజర్వేషన్ల అమలుపై స్పందిస్తూ.. చంద్రబాబు హయాంలో అందులో నుంచి కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారని.. ఇది చాలా సముచితమని తెలిపారు. నవ్యాంధ్రలో 48-50శాతం వరకు బీసీలు, 16 శాతం ఎస్సీలు, 5.5 శాతం ఎస్టీలు ఉన్నారని.. అగ్ర కులాల్లో సగం మంది కాపులు, బలిజ తెలగ వారే ఉన్నారని వివరించారు. 

ఈ రీత్యా 10 శాతం కోటాలో కాపు, బలిజ, తెలగలకు 5 శాతం, మిగతా 5 శాతం రిజర్వేషన్లకు కమ్మ, రెడ్డి, ఇతర అగ్ర సామాజిక వర్గాలకు కల్పించాలని ప్రతిపాదించారు. ఈ దిశగా ముఖ్యమంత్రికి ఎవరైనా సలహా ఇవ్వాలని కోరుతున్నానని తెలిపారు. కాగా, విశాఖలో ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. 

బెయిల్ రద్దు పిటిషన్: రఘురామకు షాక్.. జగన్, విజయసాయిరెడ్డిలకు సీబీఐ కోర్టులో ఊరట

ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్నారు. ప్రజలు కరెంటు బిల్లు కట్టకపోతే జరిమానా వేయడమే కాకుండా ఫ్యూజులు పీకేస్తారని, కాంట్రాక్టులు చేసిన వారికి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే ఎవరి ఫ్యూజులు పీకేయాలని నిలదీశారు. సినిమా టికెట్ల ధరల నియంత్రణ ప్రజల ఇబ్బందులు తగ్గించేందుకేనంటున్న మంత్రి పేర్నినాని.. దసరా సందర్భంగా ఆర్టీసీ చార్జీల బాదుడుకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 

కాగా, గత నెల మధ్యలో అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఊరట కలిగింది. రఘరామ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు  పిటిషన్లను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు  తెలంగాణ హైకోర్టును కోరారు.

 

 

click me!