నిన్న స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ: నేడు చంద్రబాబుతో స్టాలిన్ దూత

Published : May 14, 2019, 03:08 PM ISTUpdated : May 14, 2019, 03:10 PM IST
నిన్న స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ:  నేడు చంద్రబాబుతో స్టాలిన్ దూత

సారాంశం

డీఎంకె నేత దొరై మురుగన్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో మంగళవారం నాడు  అమరావతిలో భేటీ అయ్యారు. సోమవారం నాడు తెలంగాణ సీఎం డీఎంకె చీఫ్ స్టాలిన్‌తో భేటీ అయ్యారు


అమరావతి: డీఎంకె నేత దొరై మురుగన్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో మంగళవారం నాడు  అమరావతిలో భేటీ అయ్యారు. సోమవారం నాడు తెలంగాణ సీఎం డీఎంకె చీఫ్ స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఈ తరుణంలో దొరై మురుగన్ బాబుతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

డీఎంకె చీఫ్ స్టాలిన్ తో ఫెడరల్ ఫ్రంట్‌  ఏర్పాటు కోసం కేసీఆర్ సోమవారం నాడు చర్చించారు. అయితే థర్ట్‌ఫ్రంట్ (ఫెడరల్ ఫ్రంట్ ) ఏర్పాటు విషయమై కేసీఆర్ సానుకూలంగా  స్పందించలేదని సమాచారం.

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే ఫ్రంట్‌లో కొనసాగేందుకు స్టాలిన్ మొగ్గు చూపినట్టుగా ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే కేసీఆర్ స్టాలిన్‌తో సమావేశమైన మరునాడు ఆ పార్టీకి చెందిన నేత దొరై మురుగన్ ఏపీ సీఎం బాబుతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

స్టాలిన్‌తో కేసీఆర్ భేటీకి సంబంధించిన వివరాలను కూడ దొరై మురుగణ్  బాబుక వివరించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఫ్రంట్‌లో ప్రాంతీయ పార్టీలను కూడగట్టేందుకు చంద్రబాబునాయుడు కూడ ప్రయత్నాలను చేన్తున్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

కేసీఆర్‌ ఫ్రంట్‌కు షాక్: స్టాలిన్‌ వ్యాఖ్యలివే

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : మీరు ఈ వీకెండ్ కూరగాయల మార్కెట్ కు వెళుతున్నారా..? అయితే ధరలెలా ఉన్నాయో తెలుసుకొండి
CM Chandrababu Naidu: వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు| Asianet News Telugu