ఏపీ కేబినెట్ భేటీ : కీలక మంత్రులు డుమ్మా

By Nagaraju penumalaFirst Published May 14, 2019, 3:08 PM IST
Highlights

ఈ కేబినెట్ భేటీకి కేవలం నాలుగు శాఖల ప్రధాన కార్యదర్శులు మాత్రమే హాజరుకానున్నారు. వారితో ఫొని తుఫాన్, కరువు, తాగునీరు సాగునీరు, ఉపాధిహామీ పథకం వంటి నాలుగు అంశాలపై వారితో చర్చించనున్నారు. ఇకపోతే ఈ కేబినెట్ భేటీకి కీలక మంత్రులు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. 

అమరావతి: అమరావతిలో సెక్రటేరియట్ లో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. 

ఈ కేబినెట్ భేటీకి కేవలం నాలుగు శాఖల ప్రధాన కార్యదర్శులు మాత్రమే హాజరయ్యారు. వారితో ఫొని తుఫాన్, కరువు, తాగునీరు సాగునీరు, ఉపాధిహామీ పథకం వంటి నాలుగు అంశాలపై వారితో చర్చిస్తున్నారు సీఎం చంద్రబాబు.  

ఈ కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎంలు అయిన నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తిలతోపాటు మంత్రులు  నారాలోకేష్, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్న పాత్రుడు, శిద్ధా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, భూమా అఖిలప్రియ, నారాయణ, కొత్తపల్లి జవహర్‌, నక్కా ఆనంద్‌ బాబు, కళా వెంట్రావు, పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు, అమర్ నాథ్ రెడ్డిలు హాజరయ్యారు.

ఇకపోతే ఈ కేబినెట్ భేటీకి కీలక మంత్రులు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. మంత్రులు ఎన్ఎండీ ఫరూక్,యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, సుజయ్ కృష్ణరంగరావులు డుమ్మా కొట్టారు. అయితే సమాచారం ఆలస్యం కావడం వల్లే మంత్రులు రావడానికి వీలు కుదరలేదని టీడీపీ సమర్థించుకుంటుంది. 

click me!