120 స్థానాల్లో వైసీపీ గెలుపు తథ్యం: మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్

Published : May 14, 2019, 02:59 PM IST
120 స్థానాల్లో వైసీపీ గెలుపు తథ్యం: మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్

సారాంశం

రాష్ట్రంలో 120 స్థానాల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. ప్రజల మద్దతు ఉన్న జగన్ కే ఉందని ఇప్పటికే పలు జాతీయ సంస్థలు సైతం తమ సర్వేలో వెల్లడించిందని స్పష్టం చేశారు.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 120 స్థానాల్లో విజయం సాధించడం తథ్యమన్నారు మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్. మంగళవారం ఉదయం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆయన వైసీపీ అధికారంలోకి రావాలని వేడుకున్నట్లు స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో 120 స్థానాల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. ప్రజల మద్దతు ఉన్న జగన్ కే ఉందని ఇప్పటికే పలు జాతీయ సంస్థలు సైతం తమ సర్వేలో వెల్లడించిందని స్పష్టం చేశారు. మే 23న వెల్లడయ్యే ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే వస్తాయని పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

జగన్ ను అడ్డంగా ఇరికించిన సాయిరెడ్డి | Vijaysai Reddy On YS Jagan | Asianet News Telugu
Vizag Beach: గోవా దేనికి గురూ? వైజాగ్ తీరంలో ఈ టాప్ 5 బీచ్ రిసార్ట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే