జనం అతి తెలివి, దేవుడి హుండీల్లోకి భారీగా రూ.2000 నోట్లు.. పాపం పుణ్యం ఆయనదే

By Siva KodatiFirst Published Jun 1, 2023, 2:48 PM IST
Highlights

రూ.2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో జనం వాటిని వదిలించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగా ఆలయ హుండీల్లో రూ.2 వేల నోటును జమ చేస్తున్నారు. 

రూ.2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. అలాగే నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. దీంతో బీరువాల్లో మూలుగుతున్న రూ.2000 నోట్లు బయటకు వస్తున్నాయి. అయితే ఇక్కడే ప్రజలు తెలివిని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వానికి, నిఘా సంస్థలకు చిక్కకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వారు అన్వేషిస్తున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగి రూ.2 వేల నోట్లను మార్చుకునే ఓపిక లేదో ఏమో గానీ.. ఆ నోట్లన్నీ మార్చుకునే భారాన్ని భగవంతుడికే వదిలేస్తున్నారు. రూ.2 వేల నోట్లను దేవుడి హుండీలో వేసి చేతులు దులుపుకుంటున్నారు. 

ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో హుండీ లెక్కింపులో రూ.2 వేల నోట్లు భారీగా బయటపడ్డాయి. 15 రోజుల్లో 3,288 .. రెండు వేల నోట్లను అక్కడి హుండీలో వేశారు భక్తులు. వీటి విలువ రూ.7,76,000. రెండు వేల నోట్ల ఉపసంహరణకు ముందు ఎప్పుడు హుండీ లెక్కించినా రూ.2 వేల నోట్లు 40కి మించేవి కావని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. భక్తులు రూ. 2 వేల నోట్లతో ప్రసాదాలు కొని, మొక్కులు చెల్లించుకుంటున్నారని చెబుతున్నారు. 

2 వేల నోట్లు చట్టబద్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది..

విశేషమేమిటంటే, మే 19న, రూ.2,000 నోటును చలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు RBI ప్రకటించింది. అయితే, ఈ రూ.2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతూనే ఉంది. కానీ అన్ని బ్యాంకులకు రూ.2000 నోట్లను జారీ చేయడాన్ని సెంట్రల్ బ్యాంక్ నిషేధించింది. దీనితో పాటు, మే 23 నుండి నోట్లను మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నోట్ల రద్దు తర్వాత నవంబర్ 2016లో రూ.2000 నోటును ప్రవేశపెట్టారు. నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రూ.2000 నోట్లతో పాటు రూ.500, రూ.200 నోట్లను కూడా విడుదల చేశారు.

ALso Read: 2000 నోట్ల ఉపసంహరణ తర్వాత SBI బ్యాంకులో ఎన్ని 2 వేల నోట్లు జమ అయ్యాయో తెలిస్తే షాక్ అవుతారు..

ఇదిలా ఉంటే 2000 నోట్ల కరెన్సీని జనం ఇంకా వివిధ రూపాల్లో చలామణిలోకి తెచ్చేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.  ముఖ్యంగా బ్యాంకుల్లో ఈ నోట్లను మార్చుకుంటే తాము ఆదాయపన్ను శాఖ కిందికి వెళ్తాము అనే అపోహతో జనం ఎక్కువగా 2000 రూపాయల నోట్లను  ఖర్చు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.. ఇందులో భాగంగా పెట్రోల్ బంకుల్లోనూ,  నగల దుకాణాల్లోనూ,  ఖరీదైన వాచి షాపుల్లోనూ 2000 రూపాయల నోట్లతో కొనుగోలు జరుపుతున్నారు. దీంతో పలు వ్యాపారస్తులు తమ వద్ద జమ అవుతున్న 2000 రూపాయల నోట్లకు బ్యాంకులు ప్రత్యేకమైన అనుమతి ఇవ్వాలని పేర్కొంటున్నాయి. 

click me!