విద్యార్ధులకు బంపర్ ఆఫర్....స్వచ్చాంధ్రలో పాల్గొంటే 5 మార్కులు

First Published Oct 6, 2017, 3:27 PM IST
Highlights
  • ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది.
  • స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ఐదు మార్కులు అదనంగా వేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
  • 9వ తరగతి ఆపై చదువుతున్న విద్యార్థులు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటే వారికి ఈ అదనపు మార్కులు కలపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ఐదు మార్కులు అదనంగా వేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. 9వ తరగతి ఆపై చదువుతున్న విద్యార్థులు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటే వారికి ఈ అదనపు మార్కులు కలపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీలో 21 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. మరుగుదొడ్లు లేని ఇళ్లను విద్యార్థులు గుర్తించాలన్నారు. అందరూ తమ ఇళ్ళల్లో మరుగుదొడ్లను నిర్మించుకునేలా విద్యార్థులు ఇంటిలోని వారిని ఒప్పించాలని చెప్పారు.

అదే సందర్భంగా  స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరు మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామస్తులు, విద్యార్ధులు, యంత్రాంగం అంతా సమిష్టిగా కృషి చేస్తే లక్ష్యాన్ని చేరుకోవటం కష్టం కాదన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు మరుగుదొడ్ల డిజైన్ రూపొందించేలా, వైద్యవిద్యార్థులు పారిశుద్ధ్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని రెడ్డి కోరారు.

click me!