అల్లూరి జిల్లాలోని అరకు చాపరాయి వద్ద దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు హైద్రాబాద్ కొండాపూర్ కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఆర్ధిక ఇబ్బందులే కారణంగా చెబుతున్నారు.
అరకు: అల్లూరి జిల్లా అరకు చాపరాయి వద్ద దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.పురుగుల మందు తాగి దంపతులుసూసైడ్ చేసుకున్నారు. మృతులను హైద్రాబాద్ కొండాపూర్ కు చెందిన సంతోష్, సునీతగా గుర్తంచారు. చాపరాయి జలపాతం వద్ద సంతోష్, సునీత దంపతులు నిన్న ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతదేహలను విశాఖ జిల్లాలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మరణించిన సునీత ఆరు మాసాల గర్భిణి. ఆర్ధిక సమస్యలతోనే సంతోష్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ టీవీ 9 కథనం ప్రసారం చేసింది.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువకుడు తన తల్లిని హత్య చేసిన తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీలోని మిథిలేష్ తన 25 ఏళ్ల కుమారుడు క్షితిజ్ తో కలిసి ఉంటుంది. క్షితిజ్ కు ఉద్యోగం లేదు. దీంతో అతను ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఉద్యోగం రాలేదు. ఈ విషయమై ఆయన డిప్రెషన్ కు గురైనట్టుగా చెబుతున్నారు. అయితే తల్లి కొడుకుల మధ్య ఏమైందో తెలియదు కానీ తల్లిని చంపిన మూడు రోజుల తర్వాత అతను కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన ఈ నెల 5వ తేదీన వెలుగు చూసింది.
undefined
హైద్రాబాద్ ఐఐటీ క్యాంపస్ లో ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఏడాది ఆగస్టు 31న రాహుల్ సూసైడ్ చేసుకున్నాడు. ఒత్తిడి భరించలేకే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. రాహుల్ ల్యాప్ టాప్ లో సూసైడ్ లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే ఐఐటీ క్యాంపస్ కు లో మరో విద్యార్ధి తాను నివాసం ఉంటున్న లాడ్జీ భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.