కన్న బిడ్డలు కనబడలేదని ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి ఝార్ఖండ్ వాసి ఆత్మహత్యాయత్నం..

By Bukka SumabalaFirst Published Sep 15, 2022, 7:46 AM IST
Highlights

ఓ వ్యక్తి ట్రైన్ లో తన ఇద్దరు పిల్లలతో ప్రయాణిస్తున్నాడు. ఇంతలో వారిద్దరూ కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా దొరకలేదు. దీంతో మనస్తాపానికి గురై తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.

నెల్లూరు : నెల్లూరు సమీపంలోని బిట్రగుంట రైల్వే స్టేషన్ లో విషాదఘటన చోటు చేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు కరెంట్ పోల్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం ఏంటంటే.. ఒక యువకుడు తన ఇద్దరు బిడ్డలతో రైలులో ప్రయాణిస్తున్నాడు. మధ్యలో ఆకస్మికంగా ఆ పిల్లలు కనిపించకుండా పోయారు. అన్ని చోట్లా గాలించినా కనిపించలేదు. వెంటనే భార్యకు విషయం చెప్పి ఆవేదనకు గురయ్యాడు. ఆ తరువాత ఒక్కసారిగా ఓహెచ్ఈ విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుదాఘాతానికి గురై కిందపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ఈ సంఘటన బిట్రగుంట రైల్వేస్టేషన్ లో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఝార్ఖండ్ కి చెందిన జెత కండీర్ తన ఇద్దరు బిడ్డలతో కేరళ వెళ్లేందుకు టాటా నగర్ నుంచి ఎర్నాకులం వెళ్లే సూపర్ ఫాస్ట్ రైలు ఎక్కాడు. విజయవాడకు చేరుకున్న సమయంలో తన ఇద్దరు పిల్లలు కనిపించలేదు. వెంటనే ట్రైన్ మొత్తం గాలించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. కళ్లముందే పిల్లలు ఎలా మాయమయ్యారో తెలియక.. తలపట్టకున్నాడు. వెంటనే భార్యకు విషయం ఫోన్ చేసి చెప్పాడు. సోమవారం నుంచి బుధవారం వరకు గాలించాడు. కానీ ఎక్కడా కనిపించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 

దారుణం.. పన్నెండేళ్ల బాలికపై వైసీపీ కార్యకర్త అత్యాచారయత్నం..

చివరకు బిట్రగుంటకు చేరాడు.కేరళలో ఉన్న భార్య వద్దకు పిల్లలు లేకుండా ఎలా వెళ్లాలని మనస్థాపానికి గురయ్యాడు. రైల్వే స్టేషన్ భవనం ఎదురుగా ఉన్న ఓహెచ్ఈ  విద్యుత్ స్తంభం ఎక్కాడు. అయితే, ట్రాన్స్ఫార్మర్ కు కొద్ది దూరంలో ఉండగానే కరెంట్ షాక్ కు గురయ్యాడు. దీంతో అంత పైనుంచి కరెంట్ షాక్ కొట్టి కింద పడ్డాడు.  ఇది గమనించిన రైల్వే సిబ్బంది 108 వాహనాన్ని పిలిపించారు.  మెరుగైన వైద్యం కోసం కావాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ఇద్దరు పిల్లలు క్షేమం..  
కావలి జిఆర్సి ఎస్ఐ అరుణకుమారి సంఘటన జరిగిన వెంటనే దీని మీద ఆరాతీశారు. రైల్వే అధికారుల వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసిన గుర్తుతెలియని ఇద్దరు పిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నపిల్లలు ఆశ్రమంలో ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి జెత కండీర్ కు ఆ ఫొటోలు చూపించారు. వారు తన పిల్లలే అని జెత కండీర్ గుర్తించాడు. దీంతో ఆయనను పిల్లలతో మాట్లాడించారు. విషయాన్ని కేరళలో ఉన్న భార్య పౌలిన్ పుర్టికి కూడా సమాచారం చేరయడంతో ఆమె కూడా ఇక్కడికి బయలుదేరారని ఎస్సే అరుణకుమారి తెలిపారు. 

click me!