
విశాఖ క్రూయిజ్ షిప్ కు ఆటంకాలు తప్పడం లేదు. మొన్న పుదుచ్చేరి ప్రభుత్వం నో ఎంట్రీ బోర్డు పెట్టిస్తే... ఇప్పుడు విశాఖ పోర్టులో పార్కింగ్ సమస్య వచ్చింది. టెర్మినల్ నిర్మాణం కాకముందే పర్యాటక శాఖ అత్యుత్సాహం చూపడాన్ని పర్యాటకులు విమర్శిస్తున్నారు. తూర్పు తీరంలో విహార నౌక కలను నిజం చేస్తూ క్రూయిజ్ ను ప్రారంభించింది. గత 8న చెన్నైలో ప్రారంభమైన ఈ క్రూయిజ్ .. చెన్నై, పుదుచ్చేరి, విశాఖ మధ్య రాకపోకలు ప్రారంభించింది.
సముద్ర అలలపై కలల నౌక ప్రయాణాన్ని ప్రారంభించడంతో దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. 2100 మంది పట్టే సామర్ధ్యమున్న నౌక .. స్టార్ హోటల్ సౌకర్యాలతో ఆకట్టుకుంటోంది. ఊహించిన దానికంటే ఎక్కువ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్ లో మూడోసారి విశాఖకు వచ్చింది. అయితే డిమాండ్ ఆధారంగా సెప్టెంబర్ 27 వరకు టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఇంత వరకు బాగానే వున్నా.. క్రూయిజ్ రాకపోకల సమయంలో తలెత్తుతున్న సమస్యలు చికాకు పుట్టిస్తున్నాయి.
ALso REad:విశాఖ వాసులకు అద్భుత అవకాశం... సముద్రంలో సరదా విహారానికి సర్వం సిద్దం
క్యాసినో కారణంగా క్రూయిజ్ కు అనుమతి ఇవ్వబోమని పుదుచ్చేరి ప్రభుత్వం ప్రకటించింది. తొలి ప్రయత్నంలోనే సమస్యల ప్రయాణం ప్రారంభించిన క్రూయిజ్ కు ఈసారి విశాఖలో సమస్యలు తలెత్తాయి. క్రూయిజ్ నౌకలకు అవసరమైన టెర్మినల్ విశాఖలో లేకపోవడమే ఇందుకు కారణం. ఎయిర్ పోర్టులో మాదిరే క్రూయిజ్ షిప్ ల రాకపోకలకు అనుకూలంగా టెర్మినల్ వుండాలి. విదేశాలకు వెళ్లే వాటికి ఇమ్మిగ్రేషన్ చెకింగ్ తప్పనిసరి.