ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జూలై నుంచి ఆ ఏడు రైళ్లు పునరుద్దరణ..

By Sumanth KanukulaFirst Published Jun 29, 2022, 5:25 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య నడిచే రైళ్ల సర్వీసులను పునరుద్దరించింది. ఈ మేరకు దక్షిణ మధ్య ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య నడిచే రైళ్ల సర్వీసులను పునరుద్దరించింది. ఈ మేరకు దక్షిణ మధ్య ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై నుంచి 7 రైళ్లను పునరుద్దించనున్నట్టుగా చెప్పిన రైల్వే శాఖ.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించింది. అయితే ఆ ట్రైన్స్‌కు పాత నెంబర్ల స్థానంలో కొత్త నెంబర్లను కేటాయించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

- (07581) తిరుపతి నుంచి కాట్పాడి మధ్య నడిచే రైలు జూలై 11 నుంచి పునరుద్దరించనున్నారు. 10.55 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరనున్న రైలు.. 13.30 గంటలకు కాట్పాడి చేరుకోనుంది.  (07582) కాట్పాడి నుంచి తిరుపతి మధ్య నడిచే రైలును కూడా జూలై 11 నుంచి పునరుద్దరించనున్నారు. ఉదయం 21.55 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరనున్న రైలు.. 23.50 గంటలకు కాట్పాడి చేరుకోనుంది. (07864) గుంటూరు నుంచి విజయవాడ మధ్య నడిచే రైలును జూలై 18 నుంచి పునరుద్దరించనున్నారు. 17.45 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరనున్న ఈ రైలు 19.00 గంటలకు విజయవాడ చేరుకోనుంది. 

(07864) గుంటూరు నుంచి విజయవాడ మధ్య నడిచే రైలును జూలై 18 నుంచి పునరుద్దరించనున్నారు. 17.45 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరనున్న ఈ రైలు 19.00 గంటలకు విజయవాడ చేరుకోనుంది. (07282) తెనాలి నుంచి గుంటూరు మధ్య నడిచే రైలును జూలై 18 నుంచి పునరుద్దరించనున్నారు. ఈ రైలు 15.45 గంటలకు తెనాలి నుంచి 16.40 గంటలకు గుంటూరుకు చేరుకోనుంది. (07890) మర్కాపూర్ నుంచి తెనాలి మధ్య నడిచే రైలును జూలై 18 నుంచి పునరుద్దరించనున్నారు. ఈ రైలు 10.10 గంటలకు మర్కాపూర్ రోడ్డు నుంచి బయలుదేరి 14.45 గంటలకు తెనాలి చేరుకుంటుంది. 

 

SCR to restore 07 trains from the month of July -2022 pic.twitter.com/ih3vcgHAEK

— South Central Railway (@SCRailwayIndia)

 

(07284) నంద్యాల నుంచి కడప మధ్య నడిచే రైలును జూలై 16వ తేదీ నుంచి పునరుద్దరించనున్నారు. ఈ రైలు 5.50 గంటలకు నంద్యాల నుంచి బయలుదేరి 9.40 గంటలకు కడప చేరుకోనుంది. (07285) కడప నుంచి నంద్యాల మధ్య నడిచే రైలును జూలై 17 నుంచి పునరుద్దరించనున్నారు. ఈ రైలు 17.30 గంటలకు కడప నుంచి బయలుదేరి 21.30 గంటలకు నంద్యాలకు చేరుకోనుంది. కాగా, గతంలో రాకపోకలు సాగించిన ఈ రైళ్లను కోవిడ్ కారణంగా రైల్వే శాఖ రద్దు చేసింది. 
 

click me!