లెఫ్ట్ తో పొత్తు,అనంతపురంలో కాంగ్రెస్ సభ: వామపక్షాలకు షర్మిల ఆహ్వానం

By narsimha lode  |  First Published Feb 23, 2024, 2:40 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోనుంది. త్వరలోనే మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు జరగనున్నాయి.


అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి.ఈ విషయమై మూడు పార్టీల నేతలు చర్చించారు. లెఫ్ట్  నేతలతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు  వై.ఎస్. షర్మిల  శుక్రవారం నాడు  చర్చించారు.

ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలతో సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు  సమావేశమయ్యారు. ఇండియా కూటమిలో  ఈ మూడు పార్టీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి  కె. రామకృష్ణ,సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావులు ఆ పార్టీల నేతలతో కలిసి  వై.ఎస్. షర్మిలతో భేటీ అయ్యారు.  సీట్ల సర్ధుబాటు,ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోపై చర్చించారు.

Latest Videos

undefined

also read:ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కూటమి: షర్మిలతో లెఫ్ట్ నేతల భేటీ, సీట్ల సర్దుబాటుపై చర్చ

ఈ నెల  26వ తేదీన అనంతపురంలో  కాంగ్రెస్ పార్టీ  భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.ఈ సభలో ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  హాజరు కానున్నారు.ఈ సభలో పాల్గొనాలని  సీపీఐ, సీపీఐ(ఎం) నేతలను  షర్మిల ఆహ్వానించారు.కలిసి పోరాడకుంటే అధికార పార్టీలను కొట్టడం అసాధ్యమని షర్మిల చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీని  బీజేపీ ఇవ్వలేదని వై.ఎస్. షర్మిల ఆరోపించారు.

also read:కుప్పంలోనే బాబుకు భువనేశ్వరి బైబై : ఒంగోలు సభలో జగన్ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో   కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం)ల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఈ మూడు పార్టీలు  రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఐఎం)లు మధ్య సీట్ల సర్ధుబాటుపై  మూడు పార్టీల నేతలు చర్చించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్, లెప్ట్ పార్టీల మధ్య పొత్తు ఉంది.  2004 ఎన్నికల్లో ఆనాడు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీని  ఓడించేందుకు లెఫ్ట్, బీఆర్ఎస్ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది.

also read:రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత మృతి: నివాళులర్పించిన కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దఫా లెఫ్ట్ పార్టీలతో  కలిసి కాంగ్రెస్ పోటీ చేయనుంది.  2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజన జరిగింది. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దెబ్బతింది.  రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.దరిమిలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది.
 

click me!