వనజాక్షిది ఏ తప్పూ లేదు

First Published Jun 29, 2017, 8:22 AM IST
Highlights

కమిటీ ఘటనకు దారితీసిన పరిస్ధితులను పరిశీలించింది. ఇరువర్గాల వాదనలు విన్నది. తానేమి పరిధిదాటలేదని వనజాక్షి తన వాదనకు మద్దతుగా బలమైన ఆధారాలను కమిటీ ముందుంచింది. జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు, జిల్లా సరిహద్దులు, ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం మ్యాపులతో సహా కమిటి ముందు పెట్టారు.

కృష్ణాజిల్లాలో ఆమధ్య ఇసుక తవ్వకాల విషయంలో వనజాక్షి-చింతమనేని ప్రభాకర్ వివాదం గుర్తుందా? ఆ వివాదంపై చంద్రబాబునాయుడు వేసిన కమిటి వనజాక్షి తప్పులేదని తేల్చింది. దాంతో సదరు వివాదంలో ఎంఎల్ఏపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనే విషయంలో చర్చ మొదలైంది. పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు టిడిపి ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ఇసుక తవ్వకాల్లో భాగంగా కృష్ణాజిల్లాలోకి అక్రమంగా ప్రవేశించారని ఫిర్యాదులున్నాయి. 

ఆ విషయమై పరిశీలించమని కలెక్టర్ ఆదేశిస్తే ఎంఆర్ఓ వనజాక్షి తవ్వకాలు జరుగుతున్న స్థలానికి వెళ్ళి పరిశీలించారు. అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారని గమనించి అడ్డుకోబోయారు. దాంతో ఎంఎల్ఏ, అనుచరులు వనజాక్షిపై దాడి చేసారు. అప్పట్లో ఆ ఘటన రాష్ట్రంలో పెద్ద సంచలనం.

సరే, దాడికి గురైంది ఎంఆర్ఓ. దాడిచేసింది టిడిపి ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్. దాంతో చంద్రబాబు ఎంఎల్ఏకే వత్తాసు పలికారు. తప్పంతా వనజాక్షిదే అంటూ ఏకపక్షంగా తీర్పు కూడా చూప్పేసారు. ఎంఆర్ఓ తన పరిధి దాటి వ్యవహరించారంటూ అప్పట్లో వనజాక్షిపై చంద్రబాబు చిందులు కూడా తొక్కారు. అంతేకాకుండా మంత్రివర్గంలో కూడా ఈ విషయమై చర్చకు పెట్టి ఎంఎల్ఏకి క్లీన్ చిట్ ఇచ్చేసారు. దాంతో రెవిన్యూ ఉద్యోగులు మండిపోయారు. వెంటనే ఘటనపై ఇద్దరు ఐఏఎస్ అధికారులతో ఓ కమిటి వేసారు.

కమిటీ ఘటనకు దారితీసిన పరిస్ధితులను పరిశీలించింది. ఇరువర్గాల వాదనలు విన్నది. తానేమి పరిధిదాటలేదని వనజాక్షి తన వాదనకు మద్దతుగా బలమైన ఆధారాలను కమిటీ ముందుంచింది. జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు, జిల్లా సరిహద్దులు, ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం మ్యాపులతో సహా కమిటి ముందు పెట్టారు. అదే సమయంలో తవ్వకాలు సక్రమమే అనేందుకు ఎంఎల్ఏ వద్ద ఏ ఆధారాలే లేవు. కేవలం తాను టిడిపి ఎంల్ఎల్ఏ అన్న వాదన ఒక్కటే ఉంది.

దాంతో కమిటీ తమ పరిశీలన పూర్తి చేసి ఇరువైపుల వాదనను విన్న తర్వాత నివేదిక ఇచ్చింది. అందులో వనజాక్షి తప్పేమీ లేదని, ఎంఎల్ఏనే అక్రమ తవ్వకాలకు పాల్పడినట్లు కమిటి స్పష్టంగా పేర్కొంది. దాంతో అందరిలోనూ ఉత్పుకత పెరిగిపోయింది.   స్వయంగా చంద్రబాబే వనజాక్షిది తప్పని తేల్చేసారు. అయితే, నివేదికలో ఏమో వనజాక్షిది ఏ తప్పూ లేదని తేలింది. ఇపుడు ఎంఎల్ఏపై చంద్రబాబు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.

click me!