విందు కోసం రూ. 19 లక్షలా ?

First Published Jun 28, 2017, 4:34 PM IST
Highlights

ప్రభుత్వం చేస్తున్న దుబారా, ఆడంబర ఖర్చులపై ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్త సేకరించిన సమాచారం ద్వారా రూ. 19 లక్షల ఖర్చు బయటకు వచ్చింది.

ముఖ్యమంత్రైన తర్వాత చంద్రబాబునాయుడు ఆడంబరాలకు, దుబారా ఖర్చులకు చేస్తున్న ఖర్చుకు అంతులేకుండా పోతోంది. ప్రజాధనాన్ని ఏ స్ధాయిలో ఖర్చు చేస్తున్నారో లెక్కేలేదు. చంద్రబాబు చేస్తున్న దుబారా, ఆడంబరాలపై ఎన్ని విమర్శలు వస్తున్న ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. తాజాగా మరో ఆడంబర ఖర్చు వెలుగులోకి వచ్చింది. మొన్న ఫిబ్రవరిలో ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, కమర్షియల్ అండ్ ఎమర్జింగ్ లాస్’ అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు జరిగింది.

సదస్సులో హాజరయ్యే వారికోసం చంద్రబాబునాయుడు ప్రత్యేకవిందు ఏర్పాటు చేసారు. విందుకోసమే ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. అంత భారీ ఖర్చు పెట్టి ఎంతమందికి విందు ఏర్పాటు చేసారో అని అనుకోవక్కర్లేదు. ప్రత్యేక విందుకు హాజరయ్యింది కేవలం 19 మంది మాత్రమే. మరి వారి కోసం అయిన ఖర్చు ఎంతో వింటే కళ్ళు తిరగటం ఖాయం. అక్షరాల రూ. 13.38 లక్షలు. మరో రూ. 5 లక్షలు సదుపాయాలు, మొమెంటలు తదితరాల కోసమనుకోండి. మొత్తం ఖర్చు రూ. 19 లక్షలు. అన్ని లక్షలు ఖర్చుతో 19 మంది ఏం భోజనం చేసారో ఏమో ఎవరికీ తెలియటం లేదు.                        

ప్రభుత్వం చేస్తున్న దుబారా, ఆడంబర ఖర్చులపై ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్త సేకరించిన సమాచారం ద్వారా రూ. 19 లక్షల ఖర్చు బయటకు వచ్చింది.

click me!