సోషల్ మీడియాలో పోస్టులకు అరెస్టులు చెల్లవు

Published : Jun 28, 2017, 08:58 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
సోషల్ మీడియాలో పోస్టులకు అరెస్టులు చెల్లవు

సారాంశం

ఐటీ యాక్ట్ - 2000లోని సెక్షన్-66A ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉందని జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు సందర్భంగా పేర్కొంది. పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేవిధంగా ఉన్నందువల్ల ఈ సెక్షన్ చట్టసమ్మతం కాదని ధర్మాసనం తెలిపింది.

సుప్రింకోర్టు తాజా ఆదేశాలు టిడిపి ప్రభుత్వానికి తలబొప్పి కట్టించేదే. ఎందుకంటే సోషల్ మీడియాలో రాతలకు ప్రభుత్వం చేస్తున్న అరెస్టులు చెల్లవంటూ సుప్రింకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అరెస్టులకు ఊతమిస్తున్న ఐటి యాక్ట్ 2000 లోని సెక్షన్ 66Aని సుప్రింకోర్టు కొట్టేసింది. ఒక విధంగా టిడిపికి ఊహించని దెబ్బే. ఇంతకాలం తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని సాగిస్తోంది చంద్రబాబునాయుడు ప్రభుత్వం.

 ఐటీ యాక్ట్ - 2000లోని సెక్షన్-66A ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉందని జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు సందర్భంగా పేర్కొంది. పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేవిధంగా ఉన్నందువల్ల ఈ సెక్షన్ చట్టసమ్మతం కాదని ధర్మాసనం తెలిపింది.

మన రాజ్యాంగం.. పౌరులకు స్వేచ్ఛ, ఆలోచనలను వ్యక్తీకరించే హక్కును ప్రసాదించింది. వీటికి భంగం వాటిల్లేవిధంగా ఎలాంటి నిబంధనలను అంగీకరించేది లేదు' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్‌ను పూర్తిగా కొట్టేస్తున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో పోస్టింగులకు సంబంధించి ఐటీ యాక్ట్- 2000లోని సెక్షన్-66Aపై ఈమధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా పలువురు నెటిజన్లు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాలు గత నాలుగేళ్ల కాలంలో రాజకీయ నేతలపై అభ్యంతరకర రీతిలో పోస్టులు పెట్టారంటూ నెటిజన్లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టింగులకు సంబంధించి ఒక సమగ్ర నిబంధనలను తీసుకొచ్చే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. పౌరులకు తమ భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉండాలని, అదే సమయంలో అది మరొకరి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేవిధంగా ఉండకూడదని ప్రభుత్వం వాదిస్తోంది. ఏదైమైనారాజకీయ నేతల అవినీతి విశ్వరూపాన్ని ఎండగడుతున్న నెటిజన్లపై చేయి వేయాలంటే ఇక ప్రభుత్వాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే.

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu