ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా కడప జిల్లా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు.
కడప: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) మూడురోజుల పాటు సొంత జిల్లా కడప (kadapa)లో పర్యటించనున్నారు. రేపటి నుండి అంటే 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు సీఎం కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది.
రేపు గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుండి సీఎం జగన్ కడపకు చేరుకుంటారు. అక్కడినుండి నేరుగా ప్రొద్దుటూరు (prodduturu)కు వెళ్లి పలు అబివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బద్వేల్ (badvel) నియోజకవర్గంలో సెంచురీ ఫ్లైవుడ్ కంపనీకి శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుండి కడప సమీపంలోని కొప్పర్తిలో మెగా ఇండ్రస్ట్రియల్ హబ్ కు శంకుస్థాపన చేసి నేరుగా ఇడుపులపాయ (idupulapaya)కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేయనున్నారు.
undefined
read more రాజధాని వికేంద్రీకరణ తథ్యం.. అమరావతి కూడా వుంటుంది: కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
24న ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ కు చేరుకుని తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించనున్నారు జగన్. ఆ తరువాత పులివెందులకు చేరుకుని ఇండ్రస్ట్రియల్ డెవలప్ మెంట్ పార్క్ లో ఆదిత్య బిర్లాయూనిట్ కు శంకుస్ధాపన చేస్తారు. ఆ తర్వాత అక్కడే జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.
ఇక శనివారం క్రిస్మస్ (christmas) సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి పులివెందుల (pulivendula) సీఎస్ఐ చర్చిలో సీఎం జగన్ పాల్గొంటారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. అనంతరం కడప నుండి గన్నవరంకు విమానంలో చేరుకుని అక్కడి నుండి క్యాంప్ కార్యాలయానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనను ఖరారయ్యింది.