Visakhapatnam Girls Fight: విశాఖపట్నంలో బాయ్‌ఫ్రెండ్ కోసం కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. రచ్చ మాములుగా లేదుగా

Published : Dec 22, 2021, 05:21 PM IST
Visakhapatnam Girls Fight: విశాఖపట్నంలో  బాయ్‌ఫ్రెండ్ కోసం కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. రచ్చ మాములుగా లేదుగా

సారాంశం

ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. కానీ విశాఖపట్నంలో (Visakhapatnam) మాత్రం సీన్ రివర్స్ అయింది. ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నారు. ఇద్దరు అమ్మాయిలు కూడా మైనర్లే కావడం గమనార్హం.

ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. కానీ విశాఖపట్నంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నారు. అది కూడా అందరూ చూస్తుండగానే. ఇద్దరు అమ్మాయిలు మైనర్లే కావడంతో.. వీరు చేసిన రచ్చ విశాఖపట్నంలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాలు.. అనకాపల్లిలో ఓ అబ్బాయి కోసం కోసం ఇద్దరు అమ్మాయిలు రచ్చ రచ్చ చేశారు. ప్రియుడు కోసం నడిరోడ్డు మీదనే కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే జట్టు పట్టుకుని కోట్టుకున్నారు. 

కొట్టుకోవడమే కాకుండా బండ బూతులు తిట్టుకున్నాడు. అబ్బాయి తనవాడు అని ఒక అమ్మాయి అంటే.. ‘కాదే నావాడే’ అంటూ రెండో అమ్మాయి వాదించింది. ఈ క్రమంలోనే జట్టులు పట్టకుని ఒకరిపై మరోకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అయితే ఇదంతా చూస్తున్న జనానికి మాత్రం వారు ఎందుకోసం కొట్టుకుంటున్నారో తొలుత తెలియలేదు. అయితే ఆ తర్వాత వారు ప్రియుడి కోసం కొట్టుకుంటున్నారని తెలిసి ఆశ్చర్యపోయారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు మైనర్ యువతులను అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. యువతుల తల్లిదండ్రులను పిలిపించి ఈ విషయం తెలియజేశారు. ఇక, ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు మొబైల్ ఫోన్లలో వీడియో కూడా తీశారు. దీంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బాబుకు కొత్త బిరుదు ఇచ్చిన నిమ్మల | Nimmala Ramanaidu Speech | Asianet Telugu
Nara Lokesh VS Varma | CM Chandrababu Naidu | Asianet Telugu