పీఆర్సీపై ఏపీ సర్కార్ కసరత్తు: కార్యదర్శుల కమిటీ భేటీ, ఉద్యోగ సంఘాల డిమాండ్లపై చర్చ

Published : Dec 22, 2021, 05:06 PM IST
పీఆర్సీపై ఏపీ సర్కార్ కసరత్తు: కార్యదర్శుల కమిటీ భేటీ, ఉద్యోగ సంఘాల డిమాండ్లపై చర్చ

సారాంశం

పీఆర్సీపై ఏపీ సర్కార్ కసరత్తు  చేస్తోంది. ఉద్యోగుల ఆర్ధికేతర సమస్యల పరిష్కారానికి సీఎస్ నేతృత్వంలో కమిటీ భేటీ  బుధవారం నాడు భేటీ అయింది. ఉద్యోగ సంఘాలు పెట్టిన డిమాండ్లపై చర్చించింది కార్యదర్శుల కమిటీ.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Prc పై కసరత్తు ముమ్మరం చేసింది.ఉద్యోగ సంఘాల నేతలు లేవనెత్తిన ఆర్ధికేతర అంశాలపై కేంద్రీకరించాలని సీఎం Ys jagan  ఆదేశించడంతో  సీఎస్ Samer sharma నేతృత్వంలో కార్యదర్శుల కమిటీ బుధవారం నాడు సచివాలయంలో భేటీ అయింది.గత కార్యదర్శుల సమావేశంలో  చర్చించిన వివిధ అంశాలపై తీసుకున్న చర్యల నివేదిక (ఎటిఆర్)ను సమీక్షించారు. అదే విధంగా వివిధ పెండింగ్ కోర్టు కేసులకు సంబంధించిన అంశాలు,జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం లో వచ్చిన వివిధ ఆర్థిక,ఆర్థికేతర అంశాలను ఆయా శాఖల వారీగా తీసుకోవాల్సిన, పరిష్కారించాల్సిన అంశాలపై సిఎస్ డా.సమీర్ శర్మ కార్యదర్శులతో సమీక్షించారు. శాఖల వారీగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి వీలున్నంత వరకూ ఆయా సమస్యలను పరిష్కరించాలని  సీఎస్ ఆదేశించారు.జిల్లా కలెక్టర్లు కూడా జిల్లా స్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించి జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన అంశాలను ఆస్థాయిలోనే పరిష్కారం అయ్యేలా చూడాలని సిఎస్ సమీర్ శర్మ ఆదేశించారు.

also read:పీఆర్సీపై కొనసాగుతున్న పీటముడి: రేపు ఉద్యోగ సంఘాలతో సీఎస్ సమీర్ శర్మ భేటీ

పీఆర్సీ విషయమై ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలతో ఉద్యోగ సంఘాలు గతంలో రెండు దఫాలు భేటీ అయ్యాయి..ఉద్యోగుల ఆర్ధికేతర అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సీఎం జగన్ ఆదేశించారు. అంతేకాదు ఐఆర్ కంటే  ఫిట్ మెంట్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. దీంతో  ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలను సిద్దం చేస్తున్నారు. కొత్త ప్రతిపాదనలతో సీఎం వద్దకు అధికారులు వెళ్లనున్నారు. సీఎం జగన్ మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప టూర్ కంటే ముందే అధికారులు సీఎం వద్దకు ప్రతిపాదనలను తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాలతో అధికారులు,ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు విడతల వారీగా చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో  నిరసన కార్యక్రమాలను ఉద్యోగ సంఘాలు తాత్కాలికంగా వాయిదా వేసుకొన్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Warning at NTR District | “మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి” | Asianet News Telugu
IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు