
"జాబ్ కావాలంటే బాబు రావాలి..." ఇది 2014 ఎన్నికల్లో టీడీపీ పాపులర్ స్లోగన్‌లల్లో ఒకటి. కానీ ఇప్పుడు ఇదే స్లోగన్ చంద్రబాబు మెడకు చుట్టుకుంటుంది. ఒక వైపు నిరుద్యొగులు, మరో వైపు వైసీపి నేతలు ఇదే విషయం పై చంద్రబాబును ఓ రెంజీలో ఆడుకుంటున్నారు. అందులోను లోకేష్ కి ఎమ్మేల్సీ ఇచ్చి మంత్రిని చేసిన తరువాత మరింత రెచ్చిపోతున్నారు. ఇదే విషయం పై వైసీపి నేత జోగి రమేష్ మీడియా తో మాట్లాడుతు చంద్రబాబు పై ధ్వజమెత్తారు.
పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఒక్కటన్నా నేరవేర్చారా.. అని నిలదిశారు రమేష్. ఉద్యోగాల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తుంటే, చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటిస్తు జనాలను మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిరుద్యోగులనే కాదు, రుణమాపి పేరుతో చంద్రబాబు రైతులను, డ్వాక్రా మహిళలను కూడా మోసం చేస్తున్నట్లు ఆయన మండిపడ్డారు. చంద్రబాబు మీద జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు రమేష్ మద్దతుగా నిలిచారు. మోసం చేసి ప్రభుత్వాని నడపడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దేయ్యబట్టారు.
పనిలోపనిగా మంత్రుల పై కూడా రమేష్ విరుచుకు పడ్డారు. మంత్రి సోమిరెడ్డిని సోదీ రెడ్డితో పోల్చారు. అస్సలు టీడీపీ మూడున్నరేళ్లలో ఏం చేసిందని నంద్యాల ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. నంద్యాల్లో వైసీపి సింహాంలా గర్జిస్తుంటే టీడీపీ గుంటనక్కల్లా తమ పై బురద జల్లుతుందని ఎద్దేవా చేశారు.