వైసీపీలోకి ఆమంచి: సంబరాలు చేసుకొన్న టీడీపీ కార్యకర్తలు

By narsimha lodeFirst Published Feb 13, 2019, 1:43 PM IST
Highlights

చీరాల ఎమ్మెల్యే  ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో  బుధవారం నాడు టీడీపీ కార్యకర్తలు టపాకాయాలు కాల్చి సంబరాలు చేసుకొన్నారు.
 


చీరాల: చీరాల ఎమ్మెల్యే  ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో  బుధవారం నాడు టీడీపీ కార్యకర్తలు టపాకాయాలు కాల్చి సంబరాలు చేసుకొన్నారు.

చీరాలలో పార్టీలో కొందరు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆమంచి కృష్ణమోహన్ చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు.ఈ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో  ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.

మాజీ మంత్రి పాలేటీ రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గీయులు తనకు సహకరించడం లేదని  ఆమంచి కృష్ణమోహన్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను పోతుల సునీత ఖండించారు.

ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరేందుకు గాను జగన్‌తో భేటీ కాగానే  టీడీపీ నేతలు కొందరు చీరాలలోని ప్రధాన సెంటర్ వద్ద టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకొన్నారు. నగరంలో ఆమంచి ఫ్లెక్సీలను తొలగించారు.  చీరాలలో టీడీపీ కార్యకర్తలతో ఎమ్మెల్సీ కరణం బలరాం రేపు సమావేశం కానున్నారు. 

ఆమంచి పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకొన్నారనే విషయం తెలిసిన వెంటనే హర్షాతిరేకాలు చేసిన వారంతా ఆమంచికి వ్యతిరేకంగా టీడీపీలో పనిచేసినవారే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

జగన్‌తో ఆమంచి కృష్ణమోహన్ భేటీ

ఆమంచి రాజీనామా ఎఫెక్ట్: కరణం బలరామ్‌కు బాబు ఆదేశం

ఫలించని చంద్రబాబు యత్నాలు...వైసీపీలోకి ఆమంచి కృష్ణమోహన్..?

 

click me!