చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

By pratap reddyFirst Published Feb 2, 2019, 10:30 AM IST
Highlights

జయరాం జనవరి 21వ తేదీన జరిగిన కోస్టల్‌ బ్యాంక్‌ సమావేశంలో పాల్గొన్నారు. క్రమంగా తన మకాంను హైదరాబాద్‌ నుంచి విజయవాడకు మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: హత్యకు గురైన ఎన్నారై చిగురుబాటి జయరాం తన నివాసాన్ని హైదరాబాదు నుంచి విజయవాడకు మార్చాలని భావించారు. నెల రోజుల క్రితం ఆయన అమెరికాలోని ఫ్లోరిడా నుంచి హైదరాబాదు వచ్చారు. ఆయనకు అమెరికా పౌరసత్వం ఉన్న విషయం తెలిసిందే.

జయరాం జనవరి 21వ తేదీన జరిగిన కోస్టల్‌ బ్యాంక్‌ సమావేశంలో పాల్గొన్నారు. క్రమంగా తన మకాంను హైదరాబాద్‌ నుంచి విజయవాడకు మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన డ్రైవర్‌ సతీశ్‌కు బుధవారం సాయంత్రం ఈ విషయం చెప్పి గురువారం ఉదయం ఇంటికి రావాల్సిందని చెప్పాడు. గురువారం ఉదయమే సతీష్ ఆయన నివాసానికి వెళ్లాడు. 

సతీష్ వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉండంతో ఫోన్‌ చేశాడు. ఎంతకీ లిఫ్ట్‌ చేయకపోవడంతో జయరాం బంధువులు, సన్నిహితుల ఇళ్లకు వెళ్లి ఆరా తీశాడు. జయరాంకు వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్నారు. అయితే వారిని వద్దని బుధవారం సాయంత్రం స్వయంగా తన కారులో ఇంటి నుంచి బయలుదేరారు. ఆ తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. 

నందిగామ ప్రాంతంలో  హత్యకు గురయ్యారు. ఆయన తల, శరీర భాగాలపై బలమైన గాయాలు ఉన్నాయి.  జయరామ్‌ కారు విజయవాడ వైపు వెళ్లే క్రమంలో జాతీయ రహదారిపై మూడు టోల్‌గేట్లను దాటినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో ఇంటి నుంచి ఆయన ఒంటరిగా కారులో బయలుదేరారని కొందరు చెబుతున్నారు. 

అయితే, కారును తెల్లచొక్కా ధరించిన వ్యక్తి నడుపుతున్నట్టుగా పంతంగి టోల్‌ప్లాజా సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. దీంతో కారులో జయరాంతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.హైదరాబాద్‌ నుంచి వచ్చేప్పుడు జయరాం మరొకర్ని వెంట తీసుకొని వచ్చారా, లేక హైదరాబాద్‌ శివార్లలోనే జయరాంను హత్య చేసి కారులో తీసుకొచ్చి ఐతవరం వద్ద వదిలేసి పారిపోయారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. 

జయరాంకు కుటుంబం, ఆస్తుల విషయంలో గొడవలు ఉన్నాయని సమాచారం. విజయవాడ రామవరప్పాడు రింగ్‌ రోడ్డుకు సమీపాన ఉన్న ఓ స్థలం విషయంలో కుటుంబ సభ్యులతో గొడవలు నడుస్తున్నాయని పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు

click me!