రేపు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన

By Bukka SumabalaFirst Published Aug 24, 2022, 11:44 AM IST
Highlights

రేపు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. నాలుగో విడత వైఎస్సార్ నేతన్న నేస్తం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

అమరావతి : రేపు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. లబ్దిదారుల ఖాతాల్లో నగదును జగన్ జమచేయనున్నారు. లబ్దిదారులతో ఆయన ముఖాముఖిలో పాల్గొననున్నారు. అనంతరం గ్రామదర్శిని కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. బంటుమిల్లి బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. 

ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి జగన్ మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ తర్వాత ప్రతి నెలలో వెయ్యి గ్రామాల్లో సర్వే చేపడతామని అన్నారు. 3,966 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలో నెలకొల్పుతామని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే ఉపాధి హామీ, శాశ్వత భూహక్కు పైనా జగన్ అధికారులతో చర్చించారు. అక్టోబర్ నెలాఖరుకు ఆర్బికేలు, సచివాలయాలు,హెల్త్ క్లినిక్ లను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ రిలీఫ్.. బెయిల్ పొడిగించిన హైకోర్ట్

ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రుల నిర్వహణపై పర్యవేక్షణ ఉండాలని జగన్ సూచించారు. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఫోన్ నెంబర్లతో బోర్డు ఏర్పాటు చేయాలని..  అక్టోబర్ 2 నాటికి గ్రామాల్లో జగనన్న భూ హక్కు, భూరక్ష సర్వే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించాలని జగన్ అధికారులకు సూచించారు.  ప్రతి బుధవారం స్పందన వినతులపై జిల్లా కలెక్టర్లు రివ్యూ చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రతి గురువారం చీఫ్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లతో స్పందన పై సమీక్ష చేయాలన్నారు.

గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో నేరుగా ప్రజల దగ్గరకు ఎమ్మెల్యే,  సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు వెళ్తున్నారని..ప్రజల నుంచి వచ్చిన వినతుల ఆధారంగా ప్రాధాన్యతా పనులను గుర్తించాలని సీఎం కోరారు. ప్రాధాన్యతా పనుల కోసం ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించారని..  యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ల దేనని జగన్ స్పష్టం చేశారు. దాదాపు  15వేల సచివాలయాలకు ప్రాధాన్యత పనుల కోసం రూ.3వేల  కోట్లు ఖర్చు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆగస్టు 25న  నేతన్న నేస్తం, సెప్టెంబర్ 22న వైఎస్సార్ చేయూత కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఉపాధి హామీ పనుల సగటు వేతనం రూ.240 ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. 

click me!