కొంపముంచిన వాట్సాప్ మెసేజ్.. రూ.21లక్షలు పోగొట్టుకున్న రిటైర్డ్ టీచర్...

By Bukka SumabalaFirst Published Aug 24, 2022, 10:25 AM IST
Highlights

గుర్తు తెలియని నెంబర్ నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్ ఆ టీచర్ కొంపముంచింది. అకౌంట్లో నుంచి ఏకంగా రూ.21లక్షలు పోగొట్టుకుంది. 

అన్నమయ్య జిల్లా : ఆంధ్రప్రదేశ్‌, అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయురాలు సైబర్ మోసగాళ్ల బారిన పడింది. ఏకంగా రూ. 21 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. సోమవారంనాడు ఓ తెలియని నంబర్ నుండి ఆమెకు వాట్సాప్ మెసేస్ వచ్చింది. ఆ మెసేజ్ తెరిచిన తరువాత ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి సుమారు రూ. 21 లక్షలు పోగొట్టుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాకు చెందిన రిటైర్డ్ టీచర్ వరలక్ష్మికి తెలియని నంబర్ నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దీంతో సైబర్ మోసానికి గురైనట్లు ఆ ప్రాంత పోలీసులు తెలిపారు. వరలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, ఆమెకు వాట్సాప్‌లో లింక్‌తో కూడిన మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో చెప్పినట్టుగా ఆమె లింక్‌పై క్లిక్ చేసింది. అప్పటి నుండి ఆమె ఫోన్‌ హ్యాక్ అయ్యింది. అలా హ్యాక్ చేసిన కొంతమంది సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంట్ నుంచి విడతలవారీగా డబ్బును డ్రా చేశారు.

సైబర్ నేరగాళ్లు ఆమె ఖాతా నుండి రూ. 20,000, రూ. 40,000, రూ.80,000 చేస్తూ.. చివరికి మొత్తం రూ. 21 లక్షలను విత్ డ్రా చేశారు. దీన్ని ఆలస్యంగా గమనించిన వరలక్ష్మి లబోదిబో మంది. వెంటనే వరలక్ష్మి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టూ-టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని రెడ్డెప్పనాయుడు కాలనీకి చెందిన వరలక్ష్మి అనే రిటైర్డ్ టీచర్‌కు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. 

వివాహిత పేరుతో ఫేస్ బుక్ అకౌంట్.. అమ్మాయిగా పరిచయం చేసుకుని అసభ్యకర మెసేజ్ లు.. చివరికి...

దీంతో ఆమె ఓపెన్ చేసి.. అందులో ఇచ్చిన లింక్ క్లిక్ చేసింది. అప్పటి నుంచి ఆమె ఫోన్ కు అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి.ఆశ్చర్యపోయిన ఆమె బ్యాంకు అధికారులకు వీటిని చూపించింది.  అది గమనించిన వారు ఆమె అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పారు. దీంతో షాక్ అయిన ఆమె.. శనివారం సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేసింది. 

సైబర్ నేరగాళ్లు ఆమె ఫోన్, ఇతర వివరాలను హ్యాక్ చేసి, ఆమె ఆరోపించిన విధంగా సుమారు రూ. 21 లక్షలను డ్రా చేశారని తెలిసింది. తాజాగా మదనపల్లెకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జ్ఞానప్రకాష్‌ అకౌంట్ నుంచి కూడా ఇలాగే రూ.12 లక్షలు చోరీకి గురైనట్లు పోలీసులకు సమాచారం ఉంది. తాజాగా అదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై II-టౌన్ పోలీస్ స్టేషన్ కూడా కేసు నమోదు అయ్యింది. 

click me!