ఛీ.. ఆవుతో అసహజ శృంగారం.. ఓ రిటైర్డ్ అధికారి ఘాతుకం, పెంపుడు కుక్కలతో కూడా...

Published : Aug 24, 2022, 09:58 AM IST
ఛీ.. ఆవుతో అసహజ శృంగారం.. ఓ రిటైర్డ్ అధికారి ఘాతుకం, పెంపుడు కుక్కలతో కూడా...

సారాంశం

సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటనకు తెగించాడు ఓ రిటైర్డ్ అధికారి. 62యేళ్ల వయసులో బుద్ది వక్రమార్గం పట్టి ఆవుతో శృంగారం చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో అతను అరెస్టయ్యాడు. 

విశాఖపట్నం : విజయనగరంలో దుర్మార్గమైన ఘటన జరిగింది.  62 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ అధికారి ఒకరు ఆవుతో శృంగారంలో పాల్గొన్నాడు. దాన్నంతా వీడియోలో చిత్రీకరించాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ సంఘటన కొద్ది రోజుల క్రితం రాజాం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచారం గ్రామంలో జరిగింది.

ఆ వ్యక్తిని ఏపీ ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన పి రామకృష్ణగా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నవీన్ కుమార్ గుర్తించారు. ఇదే కాదు రామకృష్ణ గత కొన్నేళ్లుగా ఆవులు,పెంపుడు కుక్కలతో అసహజ శృంగారానికి పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ విషయం నిందితుడి బంధువులు, గ్రామస్తులకు ముందే తెలిసినా.. వారు మౌనంగా ఉండిపోయారు. పోలీసులకు చెప్పడం కానీ, వ్యతిరేకించడం కానీ చేయలేదు. 

మూగజీవాలని వదలని కామాంధులు... కుక్కపై నలుగురి గ్యాంగ్ రేప్

అతనికేమైనా మానసిక సమస్యలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు.. రామకృష్ణ శారీరకంగా, మానసికంగా బాగానే ఉన్నాడని తెలుస్తుందన్నారు. అయితే, అతని ఈ అసహజ ప్రవర్తనకు కారణం ఏంటీ? ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాలేదని అంటున్నారు. అతడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. IPC సెక్షన్ 377 (మానవుడు లేదా జంతువుతో అసహజ లైంగిక కార్యకలాపాల్లో.. పాల్గొంటే.. శిక్షించబడతారు) జంతువుపై క్రూరత్వంతో వ్యవహరించే సంబంధిత సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే గతంలో మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది. ఆవుపై అత్యాచారం చేసిన నిందితుడిని భోపాల్ పోలీసులు ఆ తరువాత అదుపులోకి తీసుకున్నారు. అతనిపై సెక్షన్ 377 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. 2020, జూలై 4న మధ్యప్రదేశ్‌ సుందర్‌నగర్ ప్రాంతంలోని పశువుల పాకలోకి షబ్బీర్ అలీ అనే 55 ఏళ్ల వ్యక్తి చొరబడి, అక్కడున్న ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఎప్పుడూ లేని విధంగా ఆవు విపరీతంగా అరుస్తుండడంతో... ఇంటి యజమాని అక్కడికి వెళ్లి చూశాడు. అప్పటికే నిందితుడు పరారయ్యాడు. దీంతో  అనుమానం వచ్చిన యజమాని పశువుల పాకలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించాడు. దాంట్లో షబ్బీర్ ఆవుపై అత్యాచారానికి పాల్పడినట్టుగా తేలింది. దీంతో షాక్ అయిన అతను ఈ ఘటనపై అశోక్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: చంద్రబాబు పంచ్ లకి పడి పడి నవ్విన నారా భువనేశ్వరి| Asianet News Telugu
Vangalapudi Anitha Strong Warning to Jagan: గుర్తుపెట్టుకో జగన్ ఎవ్వరినీ వదిలిపెట్టం |Asianet Telugu