ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని టీడీపీ పోరుబాట.. నవంబర్ 9న ధర్నాలు.. జగన్‌పై చంద్రబాబు ఫైర్..

By team telugu  |  First Published Nov 6, 2021, 1:56 PM IST

పెట్రోల్‌, డీజిల్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) డిమాండ్ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్రంలో ఎక్కువ ధరలు ఉన్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు (petrol diesel price) తగ్గించేవరకు టీడీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. 


పెట్రోల్‌, డీజిల్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) డిమాండ్ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్రంలో ఎక్కువ ధరలు ఉన్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు (petrol diesel price) తగ్గించేవరకు టీడీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. రాష్ట్రంలో అన్ని పెట్రోల్ బంక్‌ల వద్ద మంగళ వారం (నవంబర్ 9వ తేదీ) మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు టీడీపీ శ్రేణులు ధర్నాలు చేపట్టనున్నట్టుగా వెల్లడించారు. తమ ధర్నాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత మరిన్ని కార్యక్రమాలు చేపడతాం.. పెట్రోల్, డీజిల్ తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. శనివారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై (YS Jagan) చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

అన్ని రాష్ట్రాల్లో కన్నా ఆంధ్రప్రదేశ్‌లోనే ధరలు ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. అన్ని రాష్ట్రాలకంటే తక్కువకే ఇస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు మాత్రం ధరలు పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు. అని రాష్ట్రాల్లో తక్కువంటే.. పెట్రోల్ రూ. 94, డీజిల్ రూ. 80 గా ఉందని చంద్రబాబు తెలిపారు. ఏపీలో మాత్రం ప్రతి వస్తువుపై ధరలు పెరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై 16 రూపాయాలు తగ్గించాలని కోరారు. నిత్యావసరాలు,  నాసిరకం మద్యం, ఇసుక,  ఆర్టీసీ చార్జీలు, కరెంట్ బిల్లులు.. ఇలా ప్రతి ఒక్కటి పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. 

Latest Videos

undefined

Also read: AP Municipal Elections 2021: నెల్లూరులో బాబుకి ఎదురుదెబ్బ, మున్వర్ రాజీనామా

కేంద్రం చర్యతో అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు తగ్గించారని చంద్రబాబు చెప్పారు. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ధరలు పెంచడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ధరలు ఇంతలా ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు. చెప్పినదానికి, చేసినదానికి పొంతన ఎక్కడో ఉందో సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. ఇది చెత్త పాలన కాకుంటే మరేమిటని Chandrababu ప్రశ్నించారు.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల అన్ని రంగాలపై ప్రభావం చూపుతుందన్నారు. పరిశ్రమలతో పాటుగా, వ్యవసాయ రంగంపై ఈ ప్రభావం ఉంటుందన్నారు.  మరోవైపు రాష్ట్రంలో రోడ్లు అద్వానమైన స్థితిలో ఉన్నాయని.. రోడ్లపై ప్రయాణాలు చేస్తే తిరిగి వస్తామో..? లేమో..? చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. రోడ్లపై వెళ్తుంటే వాహనాలు దెబ్బతింటున్నాయని అన్నారు. 

Also read: చంద్రబాబు ఇలాకాలోనే ఇదీ పరిస్థితి.... టిడిపి అభ్యర్థిపై వైసిపి నాయకుల దాడి

సీఎం జగన్.. పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు చేసేందుకే అధికారం ఇచ్చారని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను, న్యాయ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఐఏఎస్‌ల చేత తప్పుడు పనులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసి.. ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మీడియో ఏదైనా రాస్తే కేసులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. అమరావతి రైతులు పోరాడుతుంటే.. వాళ్లపై దౌర్జన్యం కొనసాగిస్తున్నారు. చెప్పుకోలేని విధంగా ఆడపిల్లలపై దాడులు చేశారని ఆరోపించారు. అమరావతి రైతులకు రాష్ట్రం మొత్తం మద్దతుగా నిలుస్తుందని అన్నారు. దేశమంతా ఒక్కదారైతే.. సీఎం జగన్‌ది మరోదారి అన్నారు. జగన్‌ ప్రభుత్వం కన్నా ఎక్కువ పనులు వేసే రాష్ట్రం లేదని మండిపడ్డారు.

click me!