టిడిపి నేత కోడెల శివరాం హౌస్ అరెస్ట్ (వీడియో)

By AN TeluguFirst Published Nov 6, 2021, 10:01 AM IST
Highlights

కోడెల శివరాం నేడు రాజుపాలెం నుంచి దేవరంపాడు కొండ వరకు పాదయాత్ర చేయడానికి నిశ్చయించారు. దీంతో పాదయాత్ర కు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. 

గుంటూరు : సత్తెనపల్లి లో టిడిపి నేత కోడెల శివరాంను హౌస్ అరెస్ట్ చేశారు. కోడెల శివరాం ఇంటి వద్ద పోలీసులు మొహరించారు. Kodela Sivaram చంద్రన్న ఆశయ సాధన పేరుతో పాదయాత్ర కు సిద్దమయ్యారు.

"

కోడెల శివరాం నేడు రాజుపాలెం నుంచి దేవరంపాడు కొండ వరకు పాదయాత్ర చేయడానికి నిశ్చయించారు. దీంతో పాదయాత్ర కు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయినా కూడా వారి మాట ఖాతరు చేయకుండా కోడెల  పాదయాత్ర చేసేందుకు సిద్దమయ్యారు.

కోడెల పాదయాత్రను ఆపడానికి కోడెలను, సత్తెనపల్లి నియోజకవర్గంలోని టిడిపి నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాజుపాలెం మండల టిడిపి అధ్యక్షుడు అంచుల నరసింహారావు కూడా హౌస్ అరెస్ట్ అయ్యారు. 

ఇదిలా ఉండగా.. మున్సిపల్ ఎన్నికల వేళ చంద్రబాబుకు ఎదురుదెబ్బ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో TDPని దెబ్బ తీసే ప్రయత్నాలు ముమ్మరంగానే సాగుతున్నాయి. వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మున్వర్ టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. 

నీటి పారుదల శాఖ మంత్రి Anil Kumar Yadav సమక్షంలో Munwar తన అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వారిని అనిల్ కుమార్ యాదవ్ పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రప్యాప్తంగా కుానికి, జాతికి, మతానికి, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, దానికి ఆకర్షితులై ప్రతిపక్షానికి చెందిన నాయకులు వైసీపీలోకి వస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 

ఎన్నికల్లో విజయం సాధించడానికి టీడీపీ జాతీయాధ్యక్షుడు Chandrababu ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై పోటీ చేసినా విజయం తమ వైసీపీదేనని ఆయన అన్నారు. నెల్లూరు మున్సిపాలిటీలోని అన్ని డివిజన్లకు పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదని ాయన అన్నారు. 40 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులను బలపరచడానికి మనుషులు కూడా లభించడం లేదని ఆయన అన్నారు. Nellore Municipality పరిధిలోని మొత్తం 54 డివిజన్లలో తాము విజయం సాధిస్తామని ఆయన చెప్పారు. 

ఆయన వైసీపీకే అనుకూలం.. కుప్పంలో స్పెషల్ ఆఫీసర్‌ను తప్పించండి: హైకోర్టులో టీడీపీ లంచ్ మోషన్

కార్పోరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనైతిక పద్ధతులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. సీపీఎంతో చర్చలు టీడీపీ చర్చలు ఫలించలేదని చెప్పారు. మరో వైపు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనతో చర్చలు జరుపుతున్నారని ఆయన అన్నారు. టీడీపీ నీచమైన చర్యలకు అంతకన్నా నిదర్శనాలు ఉండబోవని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 

గతంలో ఆగిపోయిన మున్సిపాలిటీ వార్డులకు, జడ్పీటీసీ, ఎంపీటీ స్థానాలకు, పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14,15,16 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు కూడా ముగిసింది.  

click me!