YS Jagan: నవంబర్ 9న శ్రీకాకుళం జిల్లాకు సీఎం వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇదే..

Published : Nov 06, 2021, 10:32 AM IST
YS Jagan: నవంబర్ 9న  శ్రీకాకుళం జిల్లాకు సీఎం వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇదే..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) నవంబర్ 9వ తేదీన శ్రీకాకుళం వెళ్లనున్నారు. పాతపట్నంలో వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి(Reddy Shanthi) కుమార్తె, ఐఏఎస్ అధికారిణి రెడ్డి వేదిత వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరుకానున్నారు.   

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) నవంబర్ 9వ తేదీన శ్రీకాకుళం వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ఖరారు అయింది. నవంబర్ 9వ తేదీన ఉయదం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న జగన్.. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి ఉదయం 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12.05 గంటలకు హెలికాఫ్టర్‌లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు వెళ్తారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి(Reddy Shanthi) కుమార్తె, ఐఏఎస్ అధికారిణి రెడ్డి వేదిత వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరుకానున్నారు. 

అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖ ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం 2.50 గంటలనుంచి 3.30 వరకు సీఎం ప్రోగ్రాం రిజర్వ్‌లో ఉంచారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విమానంలో బయలుదేరి భువనేశ్వర్‌ వెళతారు.  

Also read: విజయనగరం: భూములు వేలం వేసి.. బకాయిలు చెల్లిస్తాం, చెరకు రైతులకు బొత్స హామీ

ఇక, తన కూతురు వివాహానికి హాజరు కావాల్సిందిగా గత నెలలోనే పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి.. సీఎం జగన్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన కూతరి వివాహా వేడుక హాజరై.. ఆశీస్సులు అందజేయాలని ఆమె సీఎం‌ను కోరారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యే రెడ్డి శాంతితో పాటు ఆమె కుమారుడు రెడ్డి శ్రావణ్‌కుమార్‌ ఉన్నారు.  

ఒడిశాకు సీఎంకు జగన్.. 
నవంబర్ 9న సాయంత్రం ముఖ్యమంత్రి జగన్.. ఒడిశాకు చేరుకోనున్నారు. ఒడిశా సీఎం Naveen patnaikతో జగన్ భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నజల వివాదంపై జగన్ చర్చించనున్నారు. ఒడిశా టూర్ లో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలతో పాటు ఇతర అంశాలపై కూడా నవీన్ పట్నాయక్ తో సీఎం జగన్ మాట్లాడనున్నారు. రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగనున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులను కూడా సీఎం జగన్ కలవనున్నారు.

Also read: అభ్యర్థులను నిలబెట్టే దిక్కేలేదు... మీరా మాకు పోటీ: టిడిపిపై మంత్రి అనిల్ ధ్వజం

Neradi barrage  బ్యారేజీతో పాటు Polavaram Project నిర్మాణంపై కూడ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయి.ఈ వివాదాల పరిష్కారం కోసం ఏపీ సీఎం జగన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో చర్చించనున్నారు.నేరడి  వద్ద బ్యారేజీ నిర్మిస్తే రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై ఏపీ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ గతంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు లేఖ రాశారు. నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం ట్రిబ్యునల్ అనుకూలంగా తీర్పు ఇచ్చింది.  ఈ బ్యారేజీ నిర్మాణంతో ఒడిశాలో 30 వేల ఎకరాలతో పాటు ఏపీలో  20వేల ఎకరాలకు సాగునీరు అవుతుంది.

మొత్తం 115 టీఎంసీలలో ఆంధ్రా 57.5 టీఎంసీల నీటిని ఉపయోగించుకొనే వీలుంది.అయితే బ్యారేజీని నిర్మించని కారణంగా ప్రస్తుతం కేవలం 45 టీఎంసీల నీటిని మాత్రమే ఉపయోగించుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.  బ్యారేజీని నిర్మిస్తే దానికి అనుసంధానంగా కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్ కి, ఎడమ కాలువ ద్వారా ఒడిశాకు నీటిని మళ్లించవచ్చు. ఈ బ్యారేజీ నిర్మాణ ఖర్చులో 10 శాతాన్ని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. 

ఇక, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిశా ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తమ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని ఒడిశా చెబుతోంది. నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే