ప్రత్యేక ప్యాకేజీకి పాతర

First Published Mar 16, 2017, 2:12 AM IST
Highlights

విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేకహోదా ఇవ్వక, చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తున్న ప్యాకేజీని పట్టించుకోక ప్రత్యేకసాయంపై మొగ్గు చూపటం గమనార్హం.

అధికారికంగా కేంద్రం ప్రత్యేకప్యాకేజీకి పాతరేసింది. విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేకహోదా ఇవ్వక, చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తున్న ప్యాకేజీని పట్టించుకోక ప్రత్యేకసాయంపై మొగ్గు చూపటం గమనార్హం. అలాగే, పోలవరం ప్రాజెక్టును కూడా కేంద్రం చేతిలోకి తీసుకుంటోంది.  మొన్నటి వరకూ ప్రాజెక్టు పనులను పోలవరం అథారిటీ చూసేది. అయితే, చంద్రబాబునాయుడు పోరాటం చేసి ప్రాజెక్టు పనులను తన చేతిలోకి తీసుకున్నారు. దాంతో కేంద్రం సరిగా నిధులు ఇవ్వక, రాష్ట్ర ప్రభుత్వ సక్రమంగా పనులు చేయించలేక పనులు మెల్లిగా సాగుతోంది. తెరవెనుక ఏం జరిగిందో కానీ ప్రాజెక్టు నాణ్యత, డిజైన్ అంశాలు, పనుల పర్యవేక్షణ, అనుమతులు తదితరాలన్నీ మళ్ళీ అథారిటి చేతిలోకి వెళుతోంది.

 

పనిలో పనిగా ప్రత్యేకసాయానికి కూడా చట్టబద్దత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రజల ఆకాంక్షలను గుర్తించటం కావచ్చు లేదా ప్రతిపక్షాల ఆందోళనా ఫలితం కావచ్చు. మొత్తానికి రాష్ట్రానికి ప్రత్యేకసాయానికి చట్టబద్దత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ప్రత్యేకసాయాన్ని జైట్లీ ప్రకటించిన ఆరుమాసాల తర్వాత కేంద్రమంత్రివర్గం స్పందించటం గమనార్హం. కేంద్రం తాజా నిర్ణయంతో ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజి లేదని తేలిపోయింది. చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తున్న ప్రత్యేకప్యాకేజికి చట్టబద్దతను కూడా కేంద్రం ఖాతరు చేయలేదు.

 

ప్రత్యేకసాయానికి చట్టబద్దత కల్పించటం ద్వారా రాబోయే లబ్దిని కూడా మంత్రివర్గం వివరించింది. 2015-16 నుండి 2019-20 మధ్య కాలంలో కేంద్రప్రాయోజిత పథకాలకు అయ్యే ఖర్చులో 90 శాతం కేంద్రం వాటాగా, 10 శాతం రాష్ట్ర వాటాగా తేల్చింది. పై కాలంలోనే ఇఎపి పద్దు క్రింద రాష్ట్రప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మేరకు రుణచెల్లింపు కోసం కేంద్రం ప్రత్యేకసాయాన్ని మంత్రివర్గం ఆమోదించింది.  

click me!