బడ్జెట్: అంకెల గారడీయేనా?

Published : Mar 15, 2017, 12:39 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
బడ్జెట్: అంకెల గారడీయేనా?

సారాంశం

సమైక్య రాష్ట్రంలోనే రూ. 1,40,742 కోట్లు బడ్జెట్ ఉండగా విడిపోయిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ రూ. 1,56,999 కోట్లెందుకని ప్రశ్నించారు

23 జిల్లాలకు కలిపి 2013-14లో రూ. 1,40,742 కోట్ల బడ్జెట్. రాష్ట్రం విడిపోయిన తర్వాత 13 జిల్లాల ఏపికి తాజా బడ్జెట్ రూ. 1,56,999 కోట్లు. ఎవరికైనా అర్ధమవుతోందా? 23 జిల్లాల రాష్ట్రం విడిపోయి 13 జిల్లాల రాష్ట్రమైపోతే బడ్జెట్ కూడా అదే దామాషాలో తగ్గాలి కదా? మరెందుకు అంతలా పెరిగిపోయింది. దాన్నే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అంకెల గారడీగా తేల్చిపారేసారు.

 

 ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై జగన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ఏకిపారేసారు. రాష్ట్రాభివృద్ధిపై  చంద్రబాబు చేస్తున్నది కేవలం గోబెల్స్ ప్రచారంగా తేల్చేసారు. రాష్ట్రాభివృద్ధి రేటును 11.61 శాతంగా చంద్రబాబు చెప్పటాన్ని జగన్ తప్పుపట్టారు. ఐఎంఎఫ్ ప్రకారం ప్రపంచ సగటు అభివృద్ధి రేటు 3.1 శాతంగా, భారతదేశ సగటు అభివృద్ధి రేటు 7.1 శాతంగా తెలిపారు. ఐఎంఎఫ్ చెప్పిన ప్రపంచ సగటును రాష్ట్రం ఇప్పటికే మించిపోయిందంటే, ప్రపంచంలో ఏపి ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రమా అంటూ ఎద్దేవా చేసారు.

 

రాష్ట్రంలోని రెండు డిస్కమ్ లు గడచిన రెండు ఏళ్ళల్లోనూ నష్టాల్లోనే ఉంటే క్రిసిల్ ఎందుకు అవార్డులు ఇచ్చిందో చెప్పాలన్నారు. విద్యుత్ సంస్కరణల అమలుకే  అవార్డులు వస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకోవటం అంతా అబద్దమన్నారు. అందిన చోటల్లా చంద్రబాబు అప్పులు చేస్తున్నట్లు ఆరోపించారు. ఎఫ్ఆర్బిఎం ప్రకారం మన రాష్ట్రం 3 శాతంకన్నా మించి అప్పులు తెచ్చుకోకూడదు. అయితే, చంద్రబాబు 5 శాతం అప్పులు చేసినట్లు ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రంలోనే రూ. 1,40,742 కోట్లు బడ్జెట్ ఉండగా విడిపోయిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ రూ. 1,56,999 కోట్లెందుకని ప్రశ్నించారు. తెలంగాణా బడ్జెట్ కూడా అదే విధంగా పెరిగిపోయిందని చెప్పారు.

 

రుణమాఫీ గురించి మాట్లాడుతూ, 87,612 వేల కోట్ల రుణాలపై రైతులు ఏడాదికి రూ. 16 వేల కోట్లు వడ్డీలు కట్టుకుంటున్నారని వాపోయారు. మొత్తం బడ్జెట్ లోని ప్రతీ అంశాలన్నింటిని వివరించారు. ప్రతీ పద్దూ కల్పనగానే మండిపడ్డారు. అందుకనే మొత్తం బడ్జెట్ ను కేవలం అంకెల గారడీగా తేల్చేసారు.

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu