బ్రిడ్జికి కలెక్టర్ పేరు: కోనసీమ జిల్లావాసుల అభిమానం ఇదీ...

By narsimha lode  |  First Published Jan 30, 2024, 9:32 AM IST

తమ బాధలను తెలుసుకొని బ్రిడ్జి నిర్మించిన కలెక్టర్ కు  డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు తమ అభిమానాన్ని వినూత్నరీతిలో చాటుకున్నారు


అమరావతి:  తమ కష్టాలను తీర్చిన కలెక్టర్ కు  డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు వినూత్నరీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు.  తమ ప్రాంతంలో నిర్మించిన బ్రిడ్జికి కలెక్టర్ పేరు పెట్టారు.

డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పెదపట్నం, దొడ్డవరం, అప్పనపల్లి, పెదపట్నంలకం గ్రామాల ప్రజలు బ్రిడ్జి లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.  ఈ గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే   నదిని పడవలపై దాటాల్సిందే. వర్షాకాలంలో  ఈ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  అయితే జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన  హిమాన్షు శుక్లా  మామిడికుదురు మండలంలో  పర్యటించిన సమయంలో శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిని పరిశీలించారు. ఈ బ్రిడ్జిని నిర్మిస్తామని స్థానికులకు కలెక్టర్ హామీ ఇచ్చారు.

Latest Videos

కలెక్టర్ ఆదేశాల మేరకు  ఇంజనీర్లు బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 54 లక్షలు ఖర్చు అవుతుందని  అధికారులు  ప్రతిపాదించారు.  ఈ బ్రిడ్జి నిర్మిస్తే నాలుగు గ్రామాల ప్రజల కష్టాలు తీరుతాయి.  అంతేకాదు గోదావరికి వరదలు వచ్చిన సహాయక చర్యలు చేపట్టేందుకు కూడ ఈ  బ్రిడ్జి దోహదపడుతుంది. 

also read:ఆ రెండు ఘటనల్లో బాబును కాపాడిన సెక్యూరిటీ: నాడు గద్వాల, నేడు రాజమండ్రి

ఈ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైనప రూ. 54 లక్షలను కలెక్టర్ విడుదల చేశారు.  దీంతో  అంతేకాదు బ్రిడ్జిని  ఆరు మాసాల్లో పూర్తి చేయించారు.  ఈ బ్రిడ్జిని  కలెక్టర్ హిమాన్షు శుక్లా  సోమవారంనాడు  ప్రారంభించారు.   తమ కష్టాలు తెలుసుకొని బ్రిడ్జి నిర్మించడంలో కీలకంగా వ్యవహరించిన కలెక్టర్ కు  స్థానికులు  ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు ఈ బ్రిడ్జికి  కలెక్టర్  హిమాన్షు శుక్లా పేరు పెట్టారు.  

also read:డీఎల్, సునీతాతో భేటీ: కడపలో షర్మిల వ్యూహం ఫలిస్తుందా?

గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద బ్రిటీష్ ప్రభుత్వ హయంలో  బ్రిడ్జి నిర్మించారు. సర్ ఆర్ధర్ కాటన్  ఈ బ్రిడ్జి నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు.దీంతో ఈ బ్రిడ్జిని కాటన్ బ్రిడ్జిగా నామకరణం చేశారు. అదే తరహాలో  మామిడికుదురు మండలంలో నిర్మించిన ఈ బ్రిడ్జికి కలెక్టర్ పేరును పెట్టి స్థానికులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని  వెంటనే  బ్రిడ్జి నిర్మాణం చేసిన కలెక్టర్ శుక్లాను  స్థానిక ఎమ్మెల్యే కొండేటి  చిట్టిబాబు అభినందించారు. 

click me!