Congress:  మేనిఫెస్టో కమిటీ కీలక భేటీ నేడే.. కాంగ్రెస్ గ్యారంటీ హామీలు ఇవేనా?

By Rajesh Karampoori  |  First Published Jan 30, 2024, 4:57 AM IST

Congress: ఎన్నికల సమరానికి ఏపీ కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మేనిఫెస్టో రూపకల్పనపై ఫోకస్ పెట్టింది. ప్రజారంజక మేనిఫెస్టోను రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో ఏఐసీసీ ఓ కమిటీని ప్రకటించింది. 
 


Congress: ఏపీ కాంగ్రెస్ బాధ్యతను వైఎస్ షర్మిల చేపట్టిన నాటి నుంచి ఆ పార్టీలో సరికొత్త జోష్ వచ్చింది. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో ఆమె పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల యాత్రను చేపట్టారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ.. పార్టీ శ్రేణులను ఉత్తేజిత పరుస్తూ.. మాజీ నేతలను, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమె జిల్లాల యాత్ర కొనసాగుతోంది. 

ఇదిలాఉంటే.. మరోవైపు ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మేనిఫెస్టో రూపకల్పనపై ఫోకస్ పెట్టింది. ప్రజారంజక మేనిఫెస్టోను రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఏఐసీసీ ఓ కమిటీని ప్రకటించింది. మొత్తం 11 మంది సభ్యులు గల ఈ కమిటీలో చైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి పల్లింరాజు, సభ్యులుగా మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి, శ్రీమతి కమలమ్మ, జంగా గౌతమ్, ఉషా నాయుడు, నజీరుద్దీన్, కొరివి వినయ్ కుమార్, డాక్టర్ గంగాధర్, కారుమంచి రమాదేవిలు నియమితులైన విషయం తెలిసిందే. 

Latest Videos

ఈ తరుణంలో  పల్లంరాజు అద్యక్షతన 11 సభ్యులతో కూడిన మ్యానిఫెస్టో కమిటి నేడు ఆంధ్రరత్న భవన్ లో భేటీ కానున్నది. ఈ కమిటీ ప్రజారంజక మ్యానిఫెస్టో తయారు చేయడమే కాకుండా అన్ని పార్టిల కంటే ముందుగా మ్యానిఫెస్టో ప్రకటించాలని భావిస్తుంది. ఈ మ్యానిఫెస్టోలో ప్రధానంగా  ప్రత్యేకహోదా, విభజన హామీలతో పాటు , సీపీఎస్ రద్దు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేతతో పాటు పలు సంక్షేమ పధకాలను పొందుపర్చాలని ఈ  కమిటి భావిస్తోంది.

మరోవైపు.. ఇప్పటికే నిరుద్యోగులు , విద్యార్దులు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు.. షర్మిలను కలిసి తమ గోడును వెల్లబుచ్చారు. త్వరలో రూపొంచనున్న మ్యానిఫెస్టోలో తమ అంశాలను ప్రస్తవించాలని విన్నవించారు. వారిని సమస్యలను కూడా ద్రుష్టిలో పెట్టుకుని మ్యానిఫోస్టు రూపొందించవచ్చని టాక్.  అలాగే.. ఇటీవల తెలంగాణలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకం వర్కవుట్ కావడంతో అదే తరహాలో గ్యారెంటి కార్డు రూపొందించేలని భావిస్తోంది.         

కమిటి తయారు చేసిన నివేదకను తొలుత వైఎస్ షర్మిల పరిశీలించనున్నారు. అవసరమైతే.. చేర్పులు మార్పులు చేసి ఆమె పార్టీ అధిష్టానానికి పంపించనున్నారు. ఏదిఏమైనా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. మ్యానిఫెస్టో ఫైనల్ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నారు.భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. రాహుల్ గాంధి చేత మ్యానిఫెస్టో ,హమీలపై ప్రకటన చేయించాలని  భావిస్తున్నట్టు తెలుస్తోంది.  
 

click me!