ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి (IPS officers have been transferred in AP). మొత్తంగా 30 మంది అధికారులు ఉండగా.. ఇందులో 28 మంది ఐపీఎస్ అధికారులు (IPS officers), ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలు (Two non-cadre SPs)ఉన్నారు. వీరందరినీ బదిలీలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra pradesh government) సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. 28 మంది ఐపీఎస్ అధికారులు, ఇద్దరు నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా.. ఇందులో ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ (వీఅండ్ఈ) డైరెక్టర్ జనరల్ గా ఉన్న కుమార్ విశ్వజిత్ ను రైల్వే అదనపు డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేశారు.
అలాగే స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (ఎస్ ఎల్ పీఆర్ బీ) చైర్మన్ గా ఉన్న అతుల్ సింగ్ ను ఏపీఎస్పీ ఏడీజీగా బదిలీ అయ్యారు. సీఐడీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉన్న సీహెచ్ శ్రీకాంత్ ను ఆక్టోపస్ ఐజీగా, ఎస్వీ రాజశేఖర్ బాబును ఎస్ఎల్ పీఆర్ బీ చైర్మన్ గా బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఐజీపీ కొల్లి రఘురాంరెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఐజీపీగా బదిలీ చేశారు.
డీజీపీ కార్యాలయ ఐజీపీ (అడ్మినిస్ట్రేషన్) సర్వశ్రేష్ఠ్ త్రిపాఠిని సీఐడీ ఐజీగా బదిలీ చేశారు. విశాఖ డీఐజీ ఎస్.హరికృష్ణను డీజీపీ కార్యాలయ ఐజీపీ (పర్సనల్)గా బదిలీ చేశారు. విజయవాడ డీసీపీ విశాల్ గున్నీని విశాఖ రేంజ్ డీఐజీగా బదిలీ అయ్యారు. సెంథిల్ కుమార్ కు, ఆక్టోపస్ డీఐజీ, లా అండ్ ఆర్డర్ డీఐజీ గా ఆదనవు బాధ్యతలు అప్పగించారు. రాహుల్ దేవ్ శర్మ ను డీఐజీ(ట్రైనింగ్)గా అపాయింట్ చేశారు.
TSPSC : టీఎస్పీఎస్సీ సభ్యుల్లో ఆంధ్రుడు.. చర్చనీయంగా మారిన రేవంత్ సర్కార్ నిర్ణయం!
సీహెచ్ విజయ రావ్ ను కర్నూల్ రేంజ్ డీఐజీ బదిలీ చేశారు. ఫకీరప్పను విశాఖ జాయింట్ కమిషనర్ గా బదిలీ చేశారు. అద్నాన్ నయీమ్ అస్మిను కృష్ణా జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. అమిత్ బర్దార్ ను ఏపీఎస్పీ 6 వ బెటాలియన్ కమాండెంట్ గా నియమించారు. అరిఫ్ హఫీజ్ ను ఐఎస్ డబ్ల్యూ ఎస్పీగా బదిలీ చేశారు. అజిత వెజెండ్ల ను వెస్ట్ గోదావరి ఎస్పీగా బదిలీ చేశారు.
కెఎస్ఎస్వీ సుబ్బా రెడ్డి ను రీజినల్ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ గా, రాజమండ్రి వై రిశాంత్ రెడ్డి సీఐ సెల్ ఎస్పీగా బదిలీ చేశారు. చిత్తూరు ఎస్పీగా పి.జాషువా, యూ.రవిప్రకాష్ ను ఏసీబీ ఎస్పీగా బదిలీ చేశారు. ఛందోలు మణికంఠ ను విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా బదిలీ చేశారు. అధిరాజ్ సింగ్ రాణాను ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ గా నియమించారు.
MLC Kavitha: 30 లక్షల ఉద్యోగాల వివరాలేవో చెప్పాలి: కవితపై కాంగ్రెస్ ఎటాక్
కృష్ణ కాంత్ పటేల్ గా ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేశారు. తుషార్ దుడి ను గుంటూరు జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. కె.శ్రీనివాసరావును జగ్గయ్యపేట డీసీపీగా బదిలీ అయ్యారు. కునుబిల్లి ధీరజ్ రంపచోడవరం ఏఎస్పీగా, జగదీష్ అదహళ్లి పాడేరు ఏఎస్పీగా, ఆనంద్ రెడ్డి విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీగా, మోకా సత్యనారాయణ - విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ -2గా బదిలీ అయ్యారు.