బోటు ప్రమాదం: గోదావరి నదిలో తేలిన బాలుడి శవం

First Published May 16, 2018, 11:46 AM IST
Highlights

గోదావరి నదిలో మునిగిన లాంచీ ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

కాకినాడ: గోదావరి నదిలో మునిగిన లాంచీ ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లాంచీ గోదావరి నదిలో 60 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. అది ఇసుకలో కూరుకుపోయిందని అంటున్నారు.

కాగా, ఓ బాలుడి శవం గోదావరినదిలో నీటిపై తేలుతూ కనిపించింది. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. సహాయక చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు.

బాధిత కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ క్రేన్ల సాయంతో బోటును తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మృతదేహాలు దొరికితే పోస్టుమార్టం చేసేందుకు పోలవరం వద్ద ఏర్పాటు చేశారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలోని మంటూరు వద్ద గోదావరి నదిలో లాంచీ మునిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 30 మంది గల్లంతైనట్లు భావిస్తున్నారు. అయితే ఎంతమంది గల్లంతయ్యారనేది  స్పష్టంగా తెలియడం లేదు. ప్రమాదసమయంలో లాంచీలో 30 మంది ఉంటారని సమాచారం ఉందని చినరాజప్ప చెప్పారు. అలాగే సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని అన్నారు.

click me!