గుంటూరులో 144 సెక్షన్..

Published : May 16, 2018, 10:16 AM IST
గుంటూరులో 144 సెక్షన్..

సారాంశం

పాత గుంటూరులో అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

బాలికపై అత్యాచారయత్నం ఘటనతో పాత గుంటూరులో అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన పాత గుంటూరులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నిందితుడు రఘును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్‌ స్టేషన్‌కు తరలివచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తూ పోలీస్‌ స్టేషన్‌ వద్ద భీభత్సం సృష్టించారు. 

ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేయడమే కాకుండా, అక్కడున్న వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత గుంటూరు 144 సెక్షన్‌ విధించారు.

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Fan Niranjan అభిమాని కోసం పవన్ శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు| Asianet Telugu
Holidays : తెలుగు స్టూడెంట్సే కాదు ఎంప్లాయిస్ కూడా ఎగిరిగంతేసే న్యూస్.. మళ్లీ వరుసగా నాల్రోజుల సెలవులు, లాంగ్ వీకెండ్