ఏపీలో పీఆర్సీ పై చ‌ర్చ‌లు.. ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ కీలక నిర్ణయాలు

Published : Dec 23, 2021, 09:27 PM IST
ఏపీలో పీఆర్సీ పై చ‌ర్చ‌లు.. ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ కీలక నిర్ణయాలు

సారాంశం

ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతోంది.  జేఏసీల చైర్మన్ ల  పిలుపు మేరకు  గురువారం విజయవాడ NGO హోం  లో స్త్రగుల్  కమిటీ సమావేశం జరిగింది. ఈ స‌మావేశంలో ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.  సీఎస్ సమీర్‌శర్మ వారం రోజుల పాటు సమయం ఇవ్వమని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కోరారు.

ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతోంది. ఎన్నిసార్లు ఎన్నిమాటలు మాట్లాడుకున్నా, లీకులు ఇస్తున్నా పీఆర్సీ ఫిట్ మెంట్ శాతంపై ప్రభుత్వం గతంలో అధికారుల కమిటీ ప్రకటించిన 14 శాతానికి మించి ఎంత ఇవ్వాలనే దానిపై తుది నిర్ణయానికి రాలేకపోతోంది. ఈ క్ర‌మంలో  ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చర్చల ఇతర పరిణామాలపై ఇరు జేఏసీల చైర్మన్ లు ఇచ్చిన పిలుపు మేరకు  గురువారం విజయవాడ NGO హోం  లో స్త్రగుల్  కమిటీ సమావేశం జరిగినది.

ఈ స‌మావేశంలో ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.  సీఎస్ సమీర్‌శర్మ వారం రోజుల పాటు సమయం ఇవ్వమని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కోరారు. సీఎస్‌పై గౌరవంతో ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని నిర్ణయించామని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.  PRC, బకాయిలు చెల్లింపు, సీపీస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర ప్రధాన డిమాండ్స్ పై ప్రభ్యుత్వం చేసిన పలురకాల ప్రకటనలపై, పలుదఫాలు వాయిదాలపై  తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనది.

Read Also: కక్షతోనే నాపై కేసులు: వైసీపీ సర్కార్ పై ఆశోక్ గజపతి రాజు

ఉద్యోగుల దాచుకున్న సొమ్ము చెల్లించకపోగా బకాయిలు 1600 నుండి 2000 కోట్లకు పెరగటం పై తీవ్రమైన ఆందోళన  కలిగిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. వీలైనంత తొందరగా వాటిని విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యమ కార్యచరణపై నిర్ణయం తీసుకోవడానికి .. ఇరు JAC ల రాష్ట్ర స్థాయి సెక్రటేరియట్ సమావేశాన్ని జనవరి 3న నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

Read Also: darbhanga blast case: ఎన్ఐఏ ఛార్జిషీట్.. కుట్ర ఇలా, నిందితులు వీరే

అంతకు ముందు ఇరు జేఏసీల ఐక్య వేదికలు క్షేత్రస్థాయి నుండి.. రాష్ట్రస్థాయి వారకూ సమావేశాలు నిర్వహించి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వానికి జనవరి 3 వరకూ సమయం ఇస్తున్నట్టు వెల్లడించారు. ఆ తరువాత ఏ క్షణంలో అయినా తిరిగి ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమని ఏపీజేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాలు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్