గుంటూరులో జిన్నాసెంటర్‌పై బీజేపీ నేత సత్యకుమార్ ట్వీట్‌: ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్

By narsimha lode  |  First Published Dec 30, 2021, 2:11 PM IST

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. దేశ ద్రోహుల పేర్లను తొలగించాలని కూడా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా డిమాండ్ చేశారు.
 



గుంటూరు: BJp జాతీయ కార్యదర్శి Satya kumar ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. Guntur  పట్టణంలో Jinnah సెంటర్  విషయమై సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. జిన్నా టవర్ సెంటర్ పేరును మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. జిన్నా టవర్ సెంటర్ పేరును Abdul kalam  లేదా Gurram Jashuva పేరుతో మార్చాలని  ఆయన డిమాండ్ చేశారు..

ఈ డిమాండ్ తో బీజేపీకి  చెందిన ఏపీ నేతలు కూడా ఏకీభవించారు.పాకిస్తాన్ లో ఉండాల్సిన జిన్నా పేరును ఏపీలో ఉండడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.దేశద్రోహుల పేర్లు ఎక్కడున్నా కూడా  తొలగించాల్సిందేనని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు.  

Latest Videos

 

This tower is named after Jinnah & area as Jinnah Centre

Irony,it’s not in Pakistan but in Guntur City of AP.

A centre that still carries the name of traitor of India.

Why shouldn’t it be named after Dr Kalam or son of the soil,a great Dalit poet,Gurram Jashuva?

Just an idea! pic.twitter.com/69tgWRsIMb

— Y. Satya Kumar (@satyakumar_y)

అయితే ఇదే విషయమై తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యే  Raja singh కూడ స్పందించారు. ఈ పేరును మార్చాలని ఆయన కోరారు. దేశ విభజనతో పాటు అనేక మంది మరణానికి జిన్నా కారణమన్నారు. జిన్నా పేరుతో సెంటర్ ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ఈ విషయమై జోక్యం చేసుకొని ఈ పేరును మార్చాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. 

also read:ఆ తర్వాత.. రాజ‌కీయాల‌కు దూరం.. సోము వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాష్ట్రం విడిపోయాక Tdp, Ycpలు పాలన సాగించాయని వారెందుకు పేరు మార్చలేదని  బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఆ ప్రాంతం పేరు మార్పుపై ఆయా పార్టీల వైఖరేంటో చెప్పాలంటూ నిలదీశారు. సత్యకుమార్ వ్యాఖ్యల్లో వివాదమేముందన్నారు. ఆ వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదమూ లేదన్నారు. జిన్నా సెంటర్ పేరును మార్చకుంటే ఆ టవర్ ను తాము కూల్చేస్తామన్నారు.  దేశ రాజధానిలోని ఔరంగజేబు రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చామని, రాష్ట్ర రాజధానిలో మార్చలేమా? అని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే సెంటర్ పేరును మహాత్మా గాంధీ సెంటర్ గా మారుస్తామని చెప్పారు. 

మరోవైపు జిన్నా సెంటర్ విషయమై బీజేపీ నేతల వ్యాఖ్యలను ముస్లిం లీగ్ అధ్యక్షుడు బషీర్ తప్పుబట్టారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు దేశ వ్యతిరేకులన్నారు. సావర్కర్ క్షమాబిక్ష కోరాడన్నారు. జిన్నా దేశ భక్తుడు అని ఆయన గుర్తు చేశారు. భారతీయులందరిని కూడగట్టి బీజేపీకి బుద్ది చెబుతామని ఆయన చెప్పారు.
 

click me!