15ఏళ్లకంటే ఎక్కువ వయసున్న యువతీ యువకులకు కూడా కరోనా వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 2తేదీ నుండి దేశవ్యాప్తంగా వీరికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
అమరావతి: 2022 జనవరి 3 నుండి ఆంధ్ర ప్రదేశ్ లోని15-18 ఏళ్లలోపు యువతీ యువకులకు కోవిడ్ 19 వ్యాక్సిన్ (corona vaccine) ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కేంద్ర ఆదేశాలతో ఈ వ్యాక్సినేషన్ (vaccination) కార్యక్రమాన్ని చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను (vaccination guidelines) తాజాగా జారీ చేసింది.
వ్యాక్సిన్ కోసం జనవరి 1వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని వైద్యారోగ్య వెల్లడించింది. 15-18 ఏళ్ల మధ్య వయసు యువతీ యువకులు కోవిన్ (cowin) యాప్ లో రిజిస్టర్ చేసుకుని 2022 జనవరి 3 తేదీ నుండి వ్యాక్సిన్ వేయించుకోవచ్చని సూచించారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈ వయసున్న వారందరికీ ప్రస్తుతం కోవాక్సిన్ (covaxin) టీకాను మాత్రమే వేయనున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
undefined
2007 అనంతరం పుట్టిన వారంతా కరోనా వ్యాక్సీన్ వేసుకోడానికి అర్హులేనని పేర్కొన్నారు. కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకున్నా వ్యాక్సీన్ వేసే వైద్యారోగ్య కేంద్రాల్లోనూ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చిన ప్రభుత్వం తెలిపింది.
read more కర్నూలు జిల్లాలో ఒమిక్రాన్ కలకలం.. డోన్‌లో భార్యాభర్తలకు పాజిటివ్, భయాందోళనలో జనం
ఇక ప్రస్తుతం ఒమిక్రాన్ (omicron) వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఆందులో భాగంగా ఇప్పటికే రెండుసార్లు కోవిడ్ టీకాలు తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు 2022 జనవరి 10తేదీ నుంచి మరో డోసు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 2 డోసు తీసుకుని 9 నెలలు దాటినవారు ఈ బూస్టర్ డోసు (booster dose) వేసుకునేందుకు అర్హులని ప్రకటించారు.
ఇక సెకండ్ డోస్ పూర్తయి 60 ఏళ్ల వయసు దాటిన వృద్దులకు కూడా ఇదే తరహాలో మరో డోసు వ్యాక్సీన్ టీకాను ఇవ్వనున్నట్లు తెలిపారు. వీరికి కూడా జనవరి 10వ తేదీ నుంచి బూస్టర్ డోస్ అందించనున్నట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
రెండో డోసు వ్యాక్సిన్ తీసుకుని 39 వారాలూ లేదా 9 నెలలు దాటితేనే బూస్టర్ టీకా వేసుకునేందుకు అర్హులని స్పష్టం చేసారు. ఈ మార్గదర్శకాలన్నీ 2022 జనవరి 3 తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కోంటూ వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయం సర్కులర్ జారీ చేసింది.
read more కేసుల పెరుగుదల థర్డ్ వేవ్ కు సంకేతం.. జాగ్రత్తగా ఉండాల్సిందే.. : డీహెచ్ శ్రీనివాసరావు
మరో తెలుగురాష్ట్రమైన తెలంగాణలో కూడా 15ఏళ్ల పైబడిన ప్రతిఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో 15-18 ఏళ్లలోపు వయస్సు గల పిల్లలు 22.78 లక్షల మంది ఉన్నారని... అందరికీ వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. 2022 జనవరి 3వ తేదీ నుండి వీరికి వ్యాక్సిన్ వేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇప్పటికే 100శాతం తొలి డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని... ఈ ఘనత వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషి వల్లే లక్ష్యం పూర్తి చేయగలిగామని మంత్రి హరీష్ పేర్కొన్నారు. ఇదే స్పూర్తితో యువతీ యువకులకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాలని వైద్య సిబ్బందికి మంత్రి హరీష్ సూచించారు.