స్టిక్కర్ మాత్రమే జగన్‌ది... డబ్బంతా కేంద్రానిదే: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jul 14, 2022, 03:54 PM IST
స్టిక్కర్ మాత్రమే జగన్‌ది... డబ్బంతా కేంద్రానిదే: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తోన్న పథకాలన్ని కేంద్రానివేనన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్. కేంద్ర పథకాలకు జగన్ తన స్టిక్కర్ వేసుకుని తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వంపై (ysrcp) మండిపడ్డారు బీజేపీ నేత (bjp) , రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్ (cm ramesh). గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల ఆకలి కేకలు జగన్ (ys jagan) ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని పేదలకు ఉచిత బియ్యాన్ని పంపిణి చేస్తోంది కేంద్రంలోని నరేంద్ర మోడీ (narendra modi) ప్రభుత్వమేనని సీఎం రమేశ్ అన్నారు. అయినప్పటికీ బియ్యాన్ని తామే పంపిణీ చేస్తున్నట్లు జగన్ ప్రభుత్వం చెప్పుకుంటోందని ఆయన చురకలు వేశారు. పేదల సంక్షేమాన్ని పట్టించుకోని ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని సీఎం రమేశ్ హెచ్చరించారు. 

కేంద్ర ప్రభుత్వ పథకాలకు జగన్ తన స్టిక్కర్ వేసుకుని తామే అమలు చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం జగన్ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారిన సీఎం రమేశ్ ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి లేదని.. శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన దుయ్యబట్టారు. 

ఇకపోతే.. ఈ నెల 5న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ... యువతకు ఉద్యోగాలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారంటూ దుయ్యబట్టారు. టీచర్స్, పోలీసు విభాగాల్లో ఖాళీలు భర్తీ చేస్తాం‌నని.. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని చెప్పారంటూ వీర్రాజు మండిపడ్డారు. అన్ని వర్గాల వారికి నేనున్నా అని చెప్పి ఓట్లు వేయించుకున్నారని ఆయన గుర్తు చేశారు.

ALso REad:నేనున్నానని చెప్పి.. అందరితో ఓట్లు, చివరికి మోసం: జగన్‌పై సోము వీర్రాజు ఆగ్రహం

యువ మోర్చా ఆధ్వర్యంలో నాలుగు జోన్లలో యాత్ర చేపట్టారని.. మా పార్టీ పరంగా మేము కార్యక్రమాలు చేసుకునే హక్కు ఉందని సోము వీర్రాజు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది నిరసన కార్యక్రమం కాదని.. అనుమతి ఇస్తారనే మేము భావిస్తున్నామన్నారు. ప్రధాని పర్యటన లో‌ నల్ల బెలూన్లు ఎగురవేయడం సరైన విధానం కాదని వీర్రాజు హితవు పలికారు. మోడీ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారని.. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివాసీల గురించి మాత్రమే మోడీ మాట్లాడారని.. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో‌ చూడటం సరి కాదని సోము వీర్రాజు హితవు పలికారు. 

కొంతమంది షడన్ గా పుట్టుకొచ్చి మేధావులుగా మాట్లాడతారని.. అటువంటి వారి మాటలను మేము పట్టించుకోమని చురకలు వేశారు. సబ్ కా సాత్, సబ్ కా‌ వికాస్ అనేది మోడీ మంత్రమని.. ఎపి లొ కొంతమంది కి అధికారమే కావాలని, అభివృద్ధి అక్కర్లేదంటూ సోము పేర్కొన్నారు. బిజెపి కి అభివృద్ధి కావాలి..‌ ప్రత్యామ్నాయ శక్తి గా ఎపిలో ఎదుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఎపి లో రెండో‌ కోటా రేషన్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసిందని.. పేదల పక్షాన బిజెపి ఉద్యమం‌ చేస్తుందన్నారు. విద్య, వైద్యానికి బిజెపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని... కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా  ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని వీర్రాజు హామీ ఇచ్చారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?