గోదావరి నదికి వరద పోటెత్తింది. రేపటికి ధవళేశ్వరం వద్ద గోదావరి 23 లక్షల క్యూసెక్కులు నీరు సముద్రంలోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం నుండి ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది.
రాజమండ్రి: Dowleswaram వద్ద ఈ నెల 15వ తేదీ నాటికి Godavari Riverకి 23 లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం నాడు సాయంత్రానికి 17 లక్షల క్యూసెక్కులకు వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Telangana లోని భద్రాచలం వద్ద వరద పరిస్థితిని బట్టి ధవళేశ్వరం వద్ద వరద పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్నారు. Bhadrachalam వద్ద గోదావరి నది 61 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద గోదావరి 18 లక్షల క్యూసెక్కులు వస్తోంది. అయితే భద్రాచలం వద్ద గోదావరికి వరది మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇవాళ సాయంత్రానికి ధవశేళ్వరం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.
undefined
ఇప్పటికే 15 లక్షల క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం వద్ద వచ్చి చేరుతుంది. సాయంత్రానికి 17 లక్షల క్యూసెక్కులకు వరద నీరు చేరే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం 7 గంటలకు ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఎగువన వస్తున్న వర్షాలతో పాటు Andhra Pradesh రాష్ట్రంలో ని గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరానికి ఈ నెల 15వ తేదీ సాయంత్రానికి 23 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
also read:భద్రాచలం వద్ద టెన్షన్: 61 అడుగులకు చేరిన గోదావరి, 144 సెక్షన్ విధింపు
అయితే 2020లో కూడా గోదావరి నదికి 22 నుండి 23 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి ధవళేశ్వరం ద్వారా విడుదల చేశామని అధికారులు చెబుతున్నారు. రేపు కూడా 22 నుండి 23 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా 23 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాని విషయాన్ని నీటి పారుదల శాఖాధికారులు గుర్తు చేస్తున్నారు.