‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’.. ఏపీ రోడ్ల దుస్థితి, జగన్ మీద పవన్ కల్యాణ్ ట్వీట్ వైరల్...

Published : Jul 14, 2022, 02:07 PM IST
‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’.. ఏపీ రోడ్ల దుస్థితి, జగన్ మీద పవన్ కల్యాణ్ ట్వీట్ వైరల్...

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ట్విట్టర్ వేదికగా కార్టూన్ కౌంటర్ వేశాడు. రోడ్ల పరిస్థితిని కూడా కాస్త పట్టించుకోండి అంటూ సెటైర్ విసిరారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవలి కాలంలో రోడ్లు బాగా పాడయ్యాయని.. రోడ్లు వేయండి మహాప్రభో అని ప్రజలు గగ్గోలు పెడుతుంటే.. జగనన్న ‘ఉయ్యాలా-జంపాలా’ పథకంలో భాగమే ఈ రోడ్లని సోషల్ మీడియా వేదికగా రోడ్ల దుస్థితిని షేరు షేస్తూ మీమ్స్, సెటైర్స్ వెల్లువెత్తుతుంటాయి. మానాడే మారెల్లంటే...నేడు కూడెల్లని... అసలే రోడ్లు దారుణమంటే... కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరీ దారుణంగా మారిపోయాయి. దీనిమీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా ఓ కార్టూన్ కౌంటర్ ఇచ్చారు. 

బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్ధతుగా పవన్ కల్యాణ్ బహిరంగ సభలో పాల్గొని మరీ గెలిపించాలని కోరారు. అయితే, అదే పవన్ కల్యాణ్ ఆత్మకూరు ఉప ఎన్నికను మాత్రం లైట్ తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థికి మద్ధతుగా ఆత్మకూరు ఉప ఎన్నికలో ఒక్క జనసేన జెండా కూడా ఎగరలేదు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ‘గోదావరి గర్జన’ పేరుతో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు కూడా పవన్ కు ఆహ్వానం అందలేదు. ఈ పరిణామాలు బీజేపీ, జనసేన మధ్య రాజకీయంగా దూరం పెరగిందనే అనుమానాలకు తావిచ్చాయి. తాజాగా.. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పవన్ కు ఆహ్వానం అందకపోవడం ఈ రెండు పార్టీల మధ్య రాజకీయంగా గ్యాప్ పెరిగిందనే వాదనకు బలం చేకూర్చింది.

ఇదిలా ఉండగా, జూన్ 8న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద జనసేన అధినేత పవన్ కల్యాన్ వ్యంగ్యాస్త్రాలు వేశారు. జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదనే అంశం మీద ఓ కార్టూన్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ట్విటర్ లో పోస్ట్ చేశారు. ‘డిగ్రీ, పీజీ కూడా చేశాను. ఏదైనా జాబు ఇమ్మంటే… ఇది ఇచ్చి వెళ్లిపోయాడు’ అంటూ ఒక నిరుద్యోగి తన చేతిలోని జాబ్ క్యాలెండర్ను చూపిస్తున్నట్లుగా ఆ కార్టూన్ లో ఉంది. పట్టభద్రుడు పకోడీలు, పండ్లు అమ్ముకుంటున్నట్లు ఉంది. ఆ పక్కనే  సీఎం సెక్యూరిటీ తో  వెళ్తున్నట్లు.. ఆయనను ఉద్దేశించి నిరుద్యోగి వ్యాఖ్యానించినట్లుగా చూపించారు. డిగ్రీ చేసి సామాన్లు మోస్తుంటే.. ఒకతను డిగ్రీ చేసి... ఇదేం పనయ్యా.. అని అడుగుతున్నట్టుగా కూడా ఉంది. దీంతో ఇప్పుడీ కార్టూన్ మీద దుమారం రేగుతోంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu