వాళ్లు ఏం తాగుతారో తెలుసు: కేటీఆర్‌కి సోము వీర్రాజు కౌంటర్

By narsimha lode  |  First Published Dec 31, 2021, 2:00 PM IST

 చీప్ లిక్కర్ ను రూ. 75 లకే అందిస్తామని తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్ధించుకొన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.


గుంటూరు:  తనను సారాయి వీర్రాజు అన్న వారు ఏం తాగుతారో తెలుసునని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు  సోము వీర్రాజు చెప్పారు.శుక్రవారం నాడు ఆయన అమరావతిలో  Somu Veerraju మీడియాతో మాట్లాడారు.  ఇటీవల విజయవాడలో నిర్వహించిన బీజేపీ ప్రజాగ్రహ సభలో తమ పార్టీ అధికారంలోకి వస్తే  చీప్ లిక్కర్ ను  రూ. 75 లకే అందిస్తామని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు చెప్పారు. ఈ కామెంట్స్ పలు  పార్టీలు విమర్శలు గుప్పించాయి. అయితే తన వ్యాఖ్యలను సోము వీర్రాజు సమర్ధించుకొన్నారు.

తాను చేస్తున్న  ప్రతి వ్యాఖ్య  2024 లో bjp  మేనిఫెస్టోలో పెడతామన్నారు. ఏపీలోని ప్రతి సమస్యకు బీజేపీ పరిష్కారం చూపుతుందని ఆయన చెేప్పారు. చీప్ లిక్కర్ పై  తాను చేసిన వ్యాఖ్యలపై ట్వీట్ చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కూడా సోము వీర్రాజు స్పందించారు. 

Latest Videos

also read:‘వాహ్.. వాట్‌ ఏ స్కీమ్.. చీప్ లిక్కర్ ఆఫర్ బీజేపీ జాతీయ విధానామా?’.. సోము వీర్రాజుపై కేటీఆర్ సెటైర్లు

 తనపై ట్వీట్ చేసిన ktr  తండ్రి తెల్లవారుజాము  మూడు గంటల వరకు  ఏం చేస్తారని సోము వీర్రాజు ప్రశ్నించారు.బీజేపీ ఏ విషయాన్నైనా సమయం సందర్భంతో మాట్లాడుతుందని చెప్పారు. గుంటూరు Jinnah  టవర్ పేరును మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.మరో వైపు రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం చర్యలను చేపడుతుంది. ఇతర పార్టీల నుండి కీలక నేతలను తమ పార్టీలోకి వచ్చేలా ప్రయత్నాలుచేస్తోంది. 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో దూకుడును పెంచాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి సూచించింది. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం కూడా వైసీపీ సర్కార్ పై దూకుడుతో విమర్శలు చేస్తొంది.

 2024లో అధికారంలోకి వచ్చాక జిన్నా సెంటర్ పేరును  మార్చేస్తామన్నారు. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరును కూడా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.అసలు కింగ్ జార్జ్ ఎవరు... ఇందులో కింగ్ ఎవరు..? జార్జ్ ఎవరు..?’’ వెంటనే ఈ పేరు మార్చాలని డిమాండ్ చేశారు.  కేజీహెచ్‌ను ‘సర్ధార్ గౌతులచ్చన్న’ పేరును బీజేపీ ప్రతిపాదిస్తోందన్నారు. 

తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 75 లకే చీప్ లిక్కర్ ఇస్తామని చెప్పడంతో పాటు రెవిన్యూ బాగుంటే రూ. 50 లకే అందిస్తామని సోము వీర్రాజు చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. సోము వీర్రాజు వ్యాఖ్యలపై వైసీపీ సహా ఇతర పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయి. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని తాను రూ. 75 లకే చీప్ లిక్కర్ అందిస్తామని వ్యాఖ్యలు చేసినట్టుగా సోము వీర్రాజు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అయితే  ఈ క్రమంలోనే గత మాసంలో తిరుపతిలో  ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బీజేపీకి చెందిన ఏపీ నేతలు భేటీ అయ్యారు ఈ  సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. స్థానికంగా ఉన్న సమస్యలపై చర్చించారు. వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న  ప్రజా వ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన ప్రజలను కోరారు.

click me!