
విజయవాడ: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారనే విషయమై ఆధారాలు దొరకలేదని విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా స్పష్టం చేశారుశుక్రవారం నాడు విజయవాడలోని తన కార్యాలయంలో Vijayawada CP మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై తప్పుడు ప్రచారం చేసి శాంతిభద్రతలకు ఇబ్బంది కల్గిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని విజయవాడ సీపీ హెచ్చరించారు. రాధా భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నామని ఆయన చెప్పారు. రెక్కీ అంశానికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని ఆయన చెప్పారు. Vangaveeti Radha ను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారనే విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని విజయవాడ సీపీ స్పష్టం చేశారు. రెండు నెలల సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నామని Kranti Rana TaTa వివరించారు. చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సీపీ తేల్చి చెప్పారు.
ఈ నెల 26న గుడివాడలో నిర్వహించిన వంగవీటి రంగా 33వ వర్ధంతి సభలో తన హత్యకు రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. దీంతో వంగవీటి రాధాకు రాష్ట్ర ప్రభుత్వం 2+2 గన్‌మెన్లను కేటాయించింది. అయితే ఈ గన్ మెన్లను వంగవీటి రాధా తిరస్కరించారు. అయితే వంగవీటి రాధా ఇంటి సమీపంలోనే ఇటీవలనే అనుమానాస్పద స్థితిలో ఉన్న స్కూటీని ఆయన అనుచరులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వంగవీటి రాధా హత్యకు రెక్కీ నిర్వహించారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
also read:వంగవీటి రాధా టీడీపీలో చేరడం ఇష్టంలేకే.. రెక్కీ : వైసీపీపై కళా వెంకట్రావు కామెంట్స్
.2019 ఎన్నికలకు ముందు వంగవీటి రాధా టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో Tdp అభ్యర్ధుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత ఏపీలో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. కొడాలి నాని, వల్లభనేని వంశీ వంగవీటి రాధాలు మంచి స్నేహితులు. వేర్వేరు పార్టీల్లో ఉన్నా కూడా వీరి మధ్య స్నేహం కొనసాగింది.డిసెంబర్ 26న వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో ఈ ముగ్గురు మంత్రులు పాల్గొన్నారు. అయితే టీడీపీలో చేరిన తర్వాత ఆదివారం నాడే వంగవీటిరాధా, వల్లభనేని వంశీ, కొడాలి నానిలు కలిశారు.
గుడివాడలో నిర్వహించిన రంగా వర్ధంతి సభలో ఏపీ మంత్రి కొడాలి నాని వంగవీటి రాధాను ప్రశంసల్లో ముంచెత్తారు. వంగవీటి రాధా బంగారమని.. కాస్త రాగి కలిపితే ఎటు కావాలంటే అటు వంగొచ్చు అన్నారు. ఎమ్మెల్సీ ఇస్తామని అప్పటి టీడీపీ నేతలు ఆఫర్ ఇచ్చినా పదవులు ఆశించకుండా పార్టీలో చేరారని కొడాలి నాని ప్రశంసించారు. ఆదివారం నాడు ఉదయం విజయవాడలో వంగవీటి రంగా విగ్రహనికి టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి రంగాకు నివాళులర్పించారు రాధా. ఈ సందర్భంగా వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వంగవీటి రంగాలను ప్రజలు ఏనాడూ మర్చిపోరని ఆయన చెప్పారు.