
గుంటూరు: మరో మహిళ మోజులో పడి కట్టుకున్న భార్య, కన్న బిడ్డల ఆలనా పాలనను పట్టించుకోవడమే మరిచాడో మాజీ ఆర్మీ జవాన్ (army jawan). అయినా భరించింది ఆ ఇల్లాలు. ఇదే అలుసుగా తీసుకుని ప్రియురాలిని రెండో పెళ్ళి చేసుకుని ఏకంగా కాపురమే పెట్టాడు. దీన్ని మాత్రం తట్టుకోలేకపోయిన బాధిత మహిళ భర్త రెండో భార్యతో వుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా (guntur district)లో చోటుచేసుకుంది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి (sattenapalli) మండలం తొండపి గ్రామానికి చెందిన ముజావర్ సైదా ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసి రిటైర్ అయ్యాడు.అతడికి ఇరవై ఏళ్ల క్రితం షాహిన్ తో వివాహమవగా ఇద్దరు మగపిల్లలు సంతానం. భార్యా పిల్లలతో కలిసి పిడుగురాళ్ల పట్టణంలో నివాసముండేవాడు సైదా. ఇరవై ఏళ్లపాటు పిల్లా పాపలతో వీరి సంసారం సాఫీగా సాగింది.
Video
అయితే ఇటీవల సైదాకు మరో మహిళతో పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో భార్యా పిల్లలను మరిచిన అతడు ప్రియురాలి వద్దే వుండసాగాడు. అయితే ఇటీవల భార్య షామిన్ పేరిట వున్న ఆస్తిని తన పేరిట రాయించుకున్న సైదా ఆమెను వదిలించుకుని ప్రియురాలితోనే వుండాలని నిర్ణయించుకున్నాడు.
read more వివాహేతర సంబంధం : భార్య కాపురానికి రాలేదని విషద్రావణం తాగిన భర్త.. ట్విస్ట్ ఏంటంటే...
పుట్టింట్లో శుభకార్యం వుండటంతో పిల్లలతో కలిసి షాహిన్ వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన సైదా ప్రియురాలితో కలిసి హైదరాబాద్ (hyderabad) కు మకాం మార్చాడు. భార్యకు మాత్రం వ్యాపారం పనిమీద బయటకు వెళ్లానని... తాను వచ్చేవరకు పుట్టింట్లోనే వుండాలని సూచించారు. నిజమేనని నమ్మిన ఆమె అక్కడే వుంది.
అయితే ప్రియురాలితో హైదరాబాద్ లో జల్సాలు చేస్తూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు సైదా. ఈ ఫోటోలు చూసి షాక్ అయిన మొదటి భార్య అత్తవారింటికి వెళ్లి అత్తామామలను నిలదీసింది. దీంతో తమను వదిలించుకోడానికి భర్త ప్రయత్నిస్తున్నట్లు షాహిన్ కు తెలిసింది.
read more Illegal affair: ప్రియురాలితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ భర్త... భార్య ఏం చేసిందంటే...
ఇంతకాలం భర్త ఆగడాలను భరించిన ఆమె ఇక అతడి ఆటకట్టించాలని నిర్ణయించుకుంది. పుట్టింటివారితో కలిసి హైదరాబాద్ లో భర్త సైదా ప్రియురాలితో వుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పిడుగురాళ్ల స్టేషన్ కి తీసుకువచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ షాహిన్ తల్లిదండ్రులు, బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంది.
ఇదిలావుంటే తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను భార్య అతి కిరాతకంగా హతమార్చిన (murder) ఘటన కృష్ణా జిల్లా (krishna district) కొద్దిరోజుల క్రితమే చోటుచేసుకుంది. విజయవాడ (vijayawada) లోని ఏలూరి రోడ్డులో పారిశుధ్ద్య కార్మికురాలిగా పనిచేసే సత్య అనే మహిళకు సత్యనారాయణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగివుంది. ఈ విషయం తెలిసి సత్యనారాయణ భార్య మల్లీశ్వరి పలుమార్లు సత్యను హెచ్చరించింది. అయినా తన భర్తను వదలకపోవడంతో కసిపెంచుకున్న మల్లీశ్వరి చివరకు సత్యను అతికిరాతకంగా హతమార్చింది.